డికాక్ మాస్ట‌ర్ మైండ్‌.. హెల్మెట్‌ను తీసి మ‌రి! వీడియో వైర‌ల్‌ | Quinton De Kock Throws His Helmet And Takes Brilliant Super Catch To Dismiss Riyan Parag, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2025: డికాక్ మాస్ట‌ర్ మైండ్‌.. హెల్మెట్‌ను తీసి మ‌రి! వీడియో వైర‌ల్‌

Published Wed, Mar 26 2025 10:46 PM | Last Updated on Thu, Mar 27 2025 12:16 PM

Quinton de Kock throws his helmet, takes Super Catch of parag

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో భాగంగా గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో రాజ‌స్తాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను డికాక్ పెవిలియ‌న్‌కు పంపాడు. రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 8 ఓవ‌ర్ వేసిన మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో మూడో బంతిని ప‌రాగ్ భారీ సిక్స‌ర్‌గా మలిచాడు. 

ఆ త‌ర్వాత బంతిని ప‌రాగ్ డిఫెన్స్ ఆడాడు. ఈ క్ర‌మంలో ఐదో బంతిని వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి.. ప‌రాగ్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని ప‌రాగ్ మ‌రో భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని చాలా ఎత్తుగా గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో వికెట్ల వెన‌క ఉన్న డికాక్ త‌న కీపింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించాడు. బంతి గాల్లోకి లేచిన వెంట‌నే డికాక్‌ క్యాచ్ కాల్ ఇచ్చాడు. 

క్లియ‌ర్ వ్యూ కోసం హెల్మెట్‌ను తీసి మ‌రి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. వెంట‌నే స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు అత‌డి వద్ద‌కు వ‌చ్చి అభినంధించారు. దీంతో 25 ప‌రుగులు చేసిన ప‌రాగ్ నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(33) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. య‌శ‌స్వి జైశ్వాల్‌(29), రియాన్ ప‌రాగ్‌(25) ప‌రుగుల‌తో రాణించారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మొయిన్ అలీ త‌లా రెండు వికెట్లు సాధించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement