టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 17) ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోర్ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు.
తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వన్ డౌన్‌లో వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 7.2 ఓవర్లు పూర్తియ్యే సరికి ఇంగ్లండ్ స్కోర్ 63/3గా ఉంది. లివింగ్‌స్టోన్ (5), హ్యారీ బ్రూక్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే 70 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment