PAK Tour Of AUS: కొత్త కెప్టెన్‌.. వచ్చీ రాగానే సెంచరీతో ఇరగదీశాడు..! | PM XI VS PAK: Captain Shan Masood Hits Century | Sakshi
Sakshi News home page

PAK Tour Of AUS: కొత్త కెప్టెన్‌.. వచ్చీ రాగానే సెంచరీతో ఇరగదీశాడు..!

Published Wed, Dec 6 2023 11:48 AM | Last Updated on Wed, Dec 6 2023 12:38 PM

PM XI VS PAK: Captain Shan Masood Hits Century - Sakshi

పాకి​స్తాన్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా ఇటీవలే నియమితుడైన షాన్‌ మసూద్‌.. కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్‌ పర్యటనలో భాగంగా ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌తో ఇవాళ (డిసెంబర్‌ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో మసూద్‌ కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాక్‌.. 78 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

మసూద్‌ 136 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ (24) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (38), మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (9), సౌద్‌ షకీల్‌ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరి నిరాశపర్చారు. ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌ బౌలర్లలో జోర్డన్‌ బకింగ్హమ్‌ 2, టాడ్‌ మర్ఫీ, మార్క్‌ స్కీకిటీ తలో వికెట్‌ పడగొట్టారు.

పాక్‌ జట్టు ప్రస్తుత ఆసీస్‌ పర్యటనలో మూడు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు పెర్త్‌లో తొలి టెస్ట్‌ జరుగనుండగా.. డిసెంబర్‌ 26-30 వరకు మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్‌.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

ఇదిలా ఉంటే, భారత్‌ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్‌ జట్టుకు షాన్‌ మసూద్‌, టీ20 జట్టుకు షాహీన్‌ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement