రిజ్వాన్‌పై విమర్శల వర్షం
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్‌పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.
ఓపెనర్ల సెంచరీలు
కాగా బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్‌తో సిరీస్‌ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఆకట్టుకున్నారు.
ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్‌కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది.
నసీం షా సైతం 33 పరుగులతో
ఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.
రిజ్వాన్ మాత్రం డకౌట్
ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్‌ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్‌లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment