సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావం పొందిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో కఠిన పరీక్షకు సిద్దమైంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో పాక్ తలపడనుంది. ఆక్టోబర్ 7 నుంచి ముల్తాన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ , ఆల్‌రౌండర్ అమీర్ జమాల్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. నోమన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. పాక్ తరపున మొత్తం 15 టెస్టులు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.
37 ఏళ్ల నోమన్ చివరిసారిగా జూలై 2023లో పాక్ తరపున ఆడాడు. అదే విధంగా ఖుర్రం షాజాద్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో జమాల్‌కు చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సెలక్ట్ అయిన పాక్ ఆటగాళ్లు ఛాంపియన్స్ వన్డే కప్‌లో భాగమయ్యారు.
అయితే ప్రధాన కోచ్ జాసన్ గిల్లెస్పీ సూచన మేరకు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లేఆఫ్‌ల నుంచి తప్పుకున్నారు. ఈ సిరీస్ కోసం షాన్ మసూద్ అండ్ కో సెప్టెంబర్ 30న ముల్తాన్‌లో సమావేశం కానున్నారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించనున్నారు.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాక్ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, మీర్ హమ్జా, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్), షాహీన్ షా ఆఫ్రిది.
చదవండి: కోహ్లితో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! 155 పరుగులతో విధ్వంసం?
Comments
Please login to add a commentAdd a comment