టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్‌కు సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.
లహోర్‌లోని హైఫెర్మామెన్స్ సెంటర్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తాజాగా ప్రీ-సిరీస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు చారిత్రత్మక గోల్డ్‌మెడల్ అందించిన అర్షద్ జావెద్‌పై మీ అభిప్రాయమేంటని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించాడు.
అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కదా అని సదరు జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించాడు.
"ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ సెటప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ పాకిస్తాన్‌కు విజయాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఏ క్రికెటర్ కూడా తమ దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను.
టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేము తొలి సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్‌లో గెలిచేందుకు మేము శర్వశక్తులా ప్రయత్నిస్తాము. అయితే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము ఓడిన ప్రతీసారి చాలా నిరాశచెందుతాం. ఇక అర్షద్ నదీమ్ ఒక నేషనల్ హీరో. నదీమ్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని" విలేకరుల సమావేశంలో మసూద్ పేర్కొన్నాడు.
బంగ్లాదేశ్ టెస్టులకు పాకిస్థాన్ టెస్టు జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment