
రావల్పిండి వేదికగా బుధవారం (ఆగస్టు21) బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. అంపైర్ తప్పుడు నిర్ణయానికి పాక్ కెప్టెన్ షాన్ మసూద్ బలైపోయాడని నెటిజన్లు అంపైర్‌పై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ అబ్దుల్ షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్.. మరో ఓపెనర్ అయూబ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాలని భావించాడు.
కానీ మసూద్ అనుకున్నది జరగలేదు. బంగ్లా పేసర్ షోర్‌ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో అనూహ్యంగా మసూద్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. పాక్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన షోర్‌ఫుల్ ఐదో బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
అయితే మసూద్ మిడ్-ఆఫ్ వైపు డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు దగ్గరగా మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్ లిట్టన్ దాస్ క్యాచ్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు.
ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఆల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్‌కు తాకిన సమయంలో స్పైక్ వచ్చినట్లు కన్పించింది. అదే సమయంలో బ్యాట్ కూడా బంతికి దగ్గరగా ఉందని భావించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.
అంపైర్ నిర్ణయాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసిన మసూద్ షాక్‌కు గురయ్యాడు. అంపైర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ మసూద్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మసూద్ ఔటయ్యాడు.
Out or not out❓
Shan Masood is dismissed by Shoriful Islam.#PAKvBAN | #TestOnHai pic.twitter.com/8OgkgQKHPa— Pakistan Cricket (@TheRealPCB) August 21, 2024