ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై షాన్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్న మసూద్ కేవలం 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 104 పరుగులతో మసూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మసూద్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. అయితే అతడికి నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. మసూద్ చివరగా 2020లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించాడు.
అంతేకాకుండా 2022 ఏడాది తర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. 2022 డిసెంబర్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. కివీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత మసూద్ సెంచరీతో మెరిశాడు. ఇక 39 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో మసూద్‌తో పాటు షఫీక్(72) పరుగులతో ఉన్నాడు.
చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment