
పెళ్లికి ఒప్పుకోలేదని.. తగలబెట్టాడు!
ముల్తాన్: పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో 40 నుంచి 50శాతం కాలిన గాయాలైన బాధితురాలు సోనియా బిబి (20) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సోనియా బిబిను లతీఫ్ అహ్మద్ (24) ఒత్తిడి చేశాడు. గతంలో ఇద్దరు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి సోనియా బిబి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్న లతీఫ్.. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తల్లిదండ్రులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన సోనియాబిబి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నది.