మాజీ క్రికెటర్ కన్నుమూత | australia former crickter max walker dies | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ కన్నుమూత

Published Wed, Sep 28 2016 12:32 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

మాజీ క్రికెటర్ కన్నుమూత

మాజీ క్రికెటర్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మ్యాక్స్ వాల్కర్ (68) కన్నుమూశాడు. రెండేళ్లుగా స్కిన్ కేన్సర్తో బాధపడుతున్న వాల్కర్ మరణించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం వెల్లడించింది.

1972-77 మధ్యకాలంలో వాల్కర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 34 టెస్టులాడిన వాల్కర్ 138 వికెట్లు పడగొట్టాడు. ఆరుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తరపున వాల్కర్ 17 వన్డేలు ఆడాడు. 1981లో న్యూజిలాండ్తో జరిగిన చివరి వన్డే అతనికి ఆఖరి మ్యాచ్. వాల్కర్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement