శ్రీలంకపై భారత్ గెలుపు | India beat Sri Lanka 2-0 in SAFF after Robin scores twice | Sakshi
Sakshi News home page

శ్రీలంకపై భారత్ గెలుపు

Published Sat, Dec 26 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

శ్రీలంకపై భారత్ గెలుపు

శ్రీలంకపై భారత్ గెలుపు

తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 2-0తో ఓడించింది. త్రివేండ్రం అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రాబిన్ సింగ్ చేశాడు.  ప్రథమార్ధం హోరాహోరీగా సాగినా ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది.

ఫలితంగా 51వ నిమిషంలో సునీల్ చెత్రి పాస్‌ను రాబిన్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో చెత్రి హెడర్‌తో పంపిన బంతిని రాబిన్ మరోసారి గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement