South Asian Football Federation
-
SAFF ఫుట్‌బాల్ ఛాంపియన్ భారత్.. 9వ సారి టైటిల్ కైవసం (ఫోటోలు)
-
చాంపియన్ భారత్
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్‌లో భారత జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలి చింది. మంగళవారం జరిగిన ఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో కువైట్ జట్టును ఓడించింది. కువైట్ పశి్చమ ఆసియా దేశమైనా పోటీతత్వం పెరగాలనే ఉద్దేశంతో దక్షిణాసియా టోరీ్నకి ఆ జట్టును ప్రత్యేకంగా ఆహా్వనించారు. లీగ్ దశలో కువైట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న భారత్ తుది పోరులో మాత్రం పైచేయి సాధించింది. ఆట 14వ నిమిషంలో అల్‌బలూషి గోల్‌తో కువైట్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 39వ నిమిషంలో లాలియన్జులా చాంగ్టే గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగానే ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ‘షూటౌట్’లో నిరీ్ణత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్లో భారత ప్లేయర్ మహేశ్ సింగ్ గోల్ చేయగా... కువైట్ ప్లేయర్ హజిహా కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ అడ్డుకోవడంతో టీమిండియా విజయం ఖాయమైంది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు), రన్నరప్ కువైట్ జట్టుకు 25 వేల డాలర్లు (రూ. 20 లక్షల 50 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 9: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ ఇప్పటివరకు 13 సార్లు జరిగింది. భారత్ తొమ్మిదిసార్లు (1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023) టైటిల్ సాధించింది. 24: ‘శాఫ్’ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 23 గోల్స్‌తో అలీ అష్ఫాక్ (మాల్దీవులు) పేరిట ఉన్న రికార్డును 24 గోల్స్‌తో సునీల్ ఛెత్రి అధిగమించాడు. ‘షూటౌట్’ సాగిందిలా... భారత్ స్కోరు కువైట్ సునీల్ ఛెత్రి 4 10 అబ్దుల్లా 8 సందేశ్ జింగాన్ 4 21 అలోతైబి 4 లాలియన్జులా 4 32 ఆల్దెఫీరి 4 ఉదాంత సింగ్ 8 33 మహ్రాన్ 4 సుభాశ్ బోస్ 4 44 అల్ఖాల్ది 4 మహేశ్ సింగ్ 4 54 హజిహా 8 -
భారత్‌కు తొలిసారి చుక్కెదురు
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్) చరిత్రలో భారత మహిళల జట్టు తొలిసారి పరాజయం చవి చూసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తరఫున మొసమ్మత్ సిరాత్ జహాన్ షోప్న (12వ, 52వ ని.లో) రెండు గోల్స్ చేయగా... కృష్ణరాణి సర్కార్ (22వ ని.లో) ఒక గోల్ సాధించింది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గి ఇప్పటికే సెమీఫైనల్ చేరిన భారత్ ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో నేపాల్‌తో ఆడుతుంది. మరో సెమీఫైనల్లో భూటాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. 2010 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ‘శాఫ్’ టోర్నీ జరగ్గా భారత్ ఐదుసార్లూ చాంపియన్‌గా నిలిచింది. ఐదు టోర్నీలలో కలిపి భారత్ మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 22 మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈ ఏడాది టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. -
దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నేపాల్ వేదికగా జరిగే దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టుకు సోమవారం పుణేలో ఐదురోజుల శిక్షణ శిబిరం మొదలైంది. సెప్టెంబర్ మూడో తేదీన భారత జట్టు నేపాల్‌కు వెళుతుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో నేపాల్, భూటాన్, శ్రీలంక జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. -
‘శాఫ్’ కప్ ఫైనల్లో భారత్‌కు షాక్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1–2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 2–0తో మాల్దీవులను ఓడించిన భారత్ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్ తరఫున సుమీత్ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్ చేయగా... మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్ (66వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. నిఖిల్ అందించిన పాస్‌ను రంజన్ సింగ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 30వ నిమిషంలో ఫరూఖ్ గోల్‌పోస్ట్‌కు అతిసమీపంలో బంతిని దొరకబుచ్చుకున్నా నియంత్రణ కోల్పోయి దాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ దాడులను కొనసాగించినా మాల్దీవులు రక్షణ పంక్తి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇంజ్యూరీ టైంలో సుమీత్ గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. -
‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్‌లో భారత్
తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరింది. ఆదివారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే నేపాల్ గోల్ చేసి భారత్‌కు షాక్‌నిచ్చింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి మరో అవకాశాన్నివ్వకుండా చెలరేగారు. భారత్ తరఫున రోలిన్ బోర్గెస్ (26వ నిమిషంలో) తొలి గోల్ చేయగా, కెప్టెన్ సునీల్ చెత్రి (68), లలియన్‌జువాలా (81, 90) ఇతర గోల్స్ చేశారు. ఇందులో 18 ఏళ్ల లలియన్‌జువాలా భారత్ తరఫున గోల్ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
శ్రీలంకపై భారత్ గెలుపు
తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 2-0తో ఓడించింది. త్రివేండ్రం అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రాబిన్ సింగ్ చేశాడు. ప్రథమార్ధం హోరాహోరీగా సాగినా ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది. ఫలితంగా 51వ నిమిషంలో సునీల్ చెత్రి పాస్‌ను రాబిన్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో చెత్రి హెడర్‌తో పంపిన బంతిని రాబిన్ మరోసారి గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు.