‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్‌లో భారత్ | Confident India take on Nepal in tricky match in SAFF Cup | Sakshi
Sakshi News home page

‘శాఫ్’ ఫుట్‌బాల్ టోర్నీ సెమీస్‌లో భారత్

Published Mon, Dec 28 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

Confident India take on Nepal in tricky match in SAFF Cup

తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు సెమీఫైనల్స్‌కు చేరింది. ఆదివారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో ఘనవిజయం సాధించింది. ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే నేపాల్ గోల్ చేసి భారత్‌కు షాక్‌నిచ్చింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి మరో అవకాశాన్నివ్వకుండా చెలరేగారు. భారత్ తరఫున రోలిన్ బోర్గెస్ (26వ నిమిషంలో) తొలి గోల్ చేయగా, కెప్టెన్ సునీల్ చెత్రి (68), లలియన్‌జువాలా (81, 90) ఇతర గోల్స్ చేశారు. ఇందులో 18 ఏళ్ల లలియన్‌జువాలా భారత్ తరఫున గోల్ చేసిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement