న్యూఢిల్లీ: వచ్చే నెలలో నేపాల్ వేదికగా జరిగే దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టుకు సోమవారం పుణేలో ఐదురోజుల శిక్షణ శిబిరం మొదలైంది.
సెప్టెంబర్ మూడో తేదీన భారత జట్టు నేపాల్‌కు వెళుతుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో నేపాల్, భూటాన్, శ్రీలంక జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 19న ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment