womens football
-
భారత్‌కు చుక్కెదురు
కట్మండు: దక్షిణాసియా సీనియర్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 2–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. -
సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్
ఢాకా: నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న దక్షిణాసియా అండర్–19 మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా ముగిశాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో రెండు జట్ల నుంచి గోల్‌కీపర్లతో సహా 11 మంది చొప్పున గోల్స్ చేయడంతో 11–11తో సమమైంది. ఈ దశలో ఫలితం తేలేవరకు ‘షూటౌట్’ను కొనసాగించాల్సి ఉండగా... టోర్నీ కమిషనర్ అనూహ్యంగా రెండు జట్ల కెపె్టన్లను పిలిచి, రిఫరీ సమక్షంలో ‘టాస్’ ద్వారా విజేతను నిర్ణయించారు. ‘టాస్’ నెగ్గడంతో టీమిండియా సంబరాలు చేసుకోగా... బంగ్లాదేశ్ బృందం మాత్రం ఈ ఫలితాన్ని నిరసిస్తూ మైదానంలోనే ఉండిపోయింది. గంటన్నర దాటినా వివాదం సద్దుమణగకపోవడంతో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని చివరకు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. -
ముద్దు వివాదం.. పదవికి రాజీనామా చేసిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్
ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తమ దేశ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను బలవంతంగా ముద్దు పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్న స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల కిందట ఫిఫా రుబియాలెస్‌పై వేటు వేసింది. తాజాగా రుబియాలెసే స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు సమర్పించాడు. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో రుబియాలెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా అవతరించింది. -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్‌పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్‌తో పాటు రుబియాలెస్‌పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్‌బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్‌లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్‌గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
Foot Ball World Cup: జగజ్జేతగా స్పెయిన్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం
ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది. ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు కూడా ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. కెప్టెన్ ఓల్గా క్యార్‌మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్మోనాకు అంతర్జాతీయ కెరీర్లో తొలి గోల్ కావడం విశేషం. -
తొలిసారి ఫైనల్లో ఇంగ్లండ్
సిడ్నీ: మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈసారి కొత్త జట్టు చాంపియన్‌గా అవతరించనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 3–1 గోల్స్ తేడాతో ఆతిథ్య ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. తద్వారా మూడో ప్రయత్నంలో ఆ జట్టు తొలిసారి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. 2015, 2019 టోర్నీల్లో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్ తరఫున ఎల్లా టూన్ (36వ ని.లో), లౌరెన్ హెంప్ (71వ ని.లో), అలెసియా రుసో (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఆస్ట్రేలియా జట్టుకు సామ్ కెర్ (63వ ని.లో) ఏకైక గోల్‌ను అందించింది. ఆదివారం జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్ 1–0తో స్వీడన్ జట్టును ఓడించింది. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ప్రపంచకప్ టోర్నీ జరగ్గా... నాలుగుసార్లు అమెరికా (1991, 1999, 2015, 2019)... రెండుసార్లు జర్మనీ (2003, 2007), ఒక్కోసారి నార్వే (1995), జపాన్ (2011) జట్లు టైటిల్ సాధించాయి. -
న్యూజిలాండ్‌లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్. న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
మరో పోరాటం.. రాంచీలో తల్లుల ఫుట్‌బాల్ ఫైనల్
కతార్ వైపు అందరూ కళ్లప్పగించి చూస్తున్నప్పుడు అక్కడికి 3000 కిలోమీటర్ల దూరంలోని జార్ఖండ్‌లో కూడా అంతే ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారమే అక్కడా ఫైనల్స్ జరిగాయి. ఎవరు గెలిచారో తర్వాతి సంగతి. కాని పిల్లల తల్లులైన గిరిజన స్త్రీలు క్రీడాదుస్తులు ధరించి బాల్ కోసం పరిగెత్తడం సామాన్యం కాదు. ఆదివాసీ స్త్రీల మీద సాగే బాల్య వివాహాలు, గృహ హింస, మంత్రగత్తె అనే అపవాదు, నిర్బంధ నిరక్షరాస్యత వంటి దురన్యాయాలపై చైతన్యం తేవడానికి ఈ తల్లుల ఫుట్‌బాల్ కప్‌ను నిర్వహిస్తున్నారు. ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్’ వినూత్నతపై కథనం. కతార్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రోమాంచిత సన్నివేశాలు చూశారు ప్రేక్షకులు. కాని మొన్న రాంచీలో జరిగిన ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్’లోని సన్నివేశాలు అంతకు తక్కువేమి కావు. సన్నివేశం 1: అనితా భేంగరాకు 24 ఏళ్లు. టీమ్‌లో జోరుగా ఫుట్‌బాల్ ఆడుతూ హటాత్తుగా ఆగిపోయింది. మేచ్ నుంచి బయటికొచ్చేసింది. కారణం? తన చంటి పిల్లాడి ఏడుపు వినిపించడమే. పాలకు వాడు ఏడుస్తుంటే వాడి దగ్గరకు పరిగెత్తింది. ఆమె లేకుండానే ఆట కొనసాగింది. బిడ్డకు పాలు ఇస్తూ తన టీమ్‌ను ఉత్సాహపరుస్తూ కూచుంది అనిత. సన్నివేశం 2: ‘నెట్టె హజమ్’ (ముందుకొచ్చి కొట్టు), ‘రుడుమ్ నెట్టె’ (పక్కకు తిరిగి కొట్టు) అని ముండారి భాషలో అరుస్తున్నాడు సుక్కు ముండా. అతను తోడుగా వచ్చిన టీమ్ గ్రౌండ్లో ఆడుతూ ఉంది. వారిలో అతని భార్య సునీతా ముండా ఉంది. అసలే అది ఫైనల్ మేచ్. భర్త ఉత్సాహానికి భార్య రెచ్చి పోయింది. గోల్ కొట్టింది. సునీత టీమే ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. సుక్కు ముండా ఉత్సాహానికి అంతే లేదు. జార్ఖండ్‌లోని రాంచీ, ఖుంతి జిల్లాలోని 23 గ్రామాల నుంచి 32 మహిళా టీములు ‘మాత్ర శక్తి ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2022’లో పాల్గొన్నాయి. 360 మంది తల్లులు ఈ టీముల్లో ఉన్నారు. కొందరు ఒక బిడ్డకు తల్లయితే మరొకరు ఇద్దరు పిల్లల తల్లి. వీరి వయసు 21 నుంచి 57 వరకూ ఉంది. ఈ టోర్నమెంట్‌ను 2018లో మొదలెట్టారు. జార్ఖండ్‌లో ఆదివాసీల కోసం పని చేస్తున్న ‘ప్రతిగ్య’ అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది. ఎందుకు ఈ టోర్నమెంట్? ►జార్ఖండ్ ఆదివాసీల్లో స్త్రీయే ప్రధాన పోషకురాలు. కుటుంబాన్ని ఆమె నడపాలి. అందువల్ల ఆమెపై కట్టడి జాస్తి. ►సంస్కృతి రీత్యా ఆమె ఒకే రకమైన దుస్తులు ధరించాలి. ఆటలు ఆడరాదు. ఆడేందుకు వేరే రకం దుస్తులు ధరించరాదు. ►చదువు వీరికి దూరం. బాల్య వివాహాలు, లైంగిక దాష్టీకాలు, మంత్రగత్తెలని చంపడం... ఇవి సర్వసాధారణం. ►ఆరోగ్య స్పృహ, వ్యక్తిగత శుభ్రత లోపం. వీటిపై పోరాడడానికి, చైతన్యం తేవడానికి, స్త్రీలలో ఐకమత్యం సాధించడానికి, తల్లులను ఇంటి నుంచి కదిలేలా చేస్తే వారి ద్వారా పిల్లలకు చదువు, ఆటలు అందుతాయనే ఉద్దేశం. వీటన్నింటి కోసం ప్రతిగ్య సంస్థ ఈ టోర్నమెంట్‌ను మొదలుపెట్టింది. నాగపూర్‌లో స్లమ్ ఫుట్‌బాల్ పుట్టినట్టు ఇది ఆదివాసీ స్త్రీల ఫుట్‌బాల్. ఎన్నో సమస్యలు అయితే 2018లో టోర్నమెంట్ కోసం ప్రతిగ్య వాలంటీర్లు పల్లెలు తిరుగుతుంటే స్త్రీల నుంచే వ్యతిరేకత ఎదురైంది. ‘మేమెందుకు ఆడాలి’ అన్నారు. భర్తలైతే కాళ్లు విరగ్గొడతాం అన్నారు. చివరకు రాంచీ జిల్లాలోని మైనీ కచ్చప్ అనే తల్లి (40) మొట్టమొదటి ప్లేయర్‌గా ఆడటానికి అంగీకరించింది. ఆమె నుంచి టీమ్ తయారైంది. 2018లో అతి కష్టమ్మీద 6 టీములు పాల్గొన్నాయి. 2019లో 24 టీములు వచ్చాయి. 2022 నాటికి టీముల సంఖ్య 32కు పెరిగింది. వీళ్లెవరికీ సరైన జెర్సీలు లేవు. షూస్ లేవు. కోచ్‌లు లేరు. ప్రచారం లేదు. స్పాన్సర్లు లేరు. ప్రైజ్ మనీని ఏర్పాటు చేయడం కూడా కష్టమే. అయినా సరే ఎంతో ఉత్సాహంగా టోర్నమెంట్లో పాల్గొన్నారు. కూతురూ తల్లి, అత్తా కోడలు ఈ టోర్నమెంట్లో ఒక పల్లెలో కూతురూ తల్లి (కూతురు కూడా తల్లే) టీమ్‌లో చేరారు. అయితే వాళ్లిద్దరూ ఆడటం ఊళ్లో మగవారికి ఇష్టం లేదు. వాళ్లను ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లే గ్రౌండ్‌కు చేర్చడానికి ఎవరూ సహకరించలేదు. దాంతో వాళ్లు నడుస్తూ వచ్చి ఆట ఆడారు. మరో ఊళ్లో అత్తా కోడలు కలిసి టీమ్‌లో చేరారు. ‘ఈ ఆట ఆడక ముందు అత్త నాతో అంటీ ముట్టనట్టు ఉండేది. ఇప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులయ్యాము. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాము. ఒకరికొకరం తోడయ్యాము’ అంది కోడలు. మొదట చర్రుపర్రుమన్న భర్తలు గ్రౌండ్లో తమ భార్యలు ఆడుతుంటే మురిసి ప్రోత్సహించడం మొదలెట్టారు. స్త్రీలందరూ ఈ గేమ్ వంకతో కలిసి మాట్లాడుకుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటి సాధన కోసం ఏం చేయాలో తెలుసుకుంటున్నారు. వాళ్లు తన్నాలనుకుంటున్న బంతి ఆ సమస్యే. ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నోచోట్ల మరెన్నో జరిగితే బాగుండు. చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన టీమిండియా
అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022లో భారత చాప్టర్ క్లోజ్ అయ్యింది. టోర్నీ మొత్తంలో భారత అమ్మాయిలు ఒక్క గోల్ కూడా కొట్టకుండా నిష్క్రమించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్ధులకు దాసోహమయ్యారు. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0-8 తేడాతో ఓటమిపాలైన భారత అమ్మాయిలు, ఆతర్వాత మొరాకో చేతిలో 0-3 తేడాతో.. చివరి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో 0-5 తేడాతో చిత్తయ్యారు. ఆతిధ్య జట్టు హోదాలో మెగా టోర్నీకి అర్హత సాధించిన భారత కనీస పోటీ కూడా ఇవ్వకుండా, పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. టోర్నీలో ప్రస్తుత పరిస్ధితి విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆఖరి స్థానంలో నిలువగా.. అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్, మొరాకో జట్లు 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. చెరి నాలుగు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి. గ్రూప్-బి నుంచి జర్మనీ, నైజీరియా.. గ్రూప్-సి నుంచి కొలొంబియా, స్పెయిన్.. గ్రూప్-డి నుంచి జపాన్, టాంజానియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
పసికూనపై ప్రతాపం.. సెమీస్‌లో భారత్
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో పసికూనలైన మాల్దీవుల జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (55వ ని.లో) ఒక గోల్... అంజు తమాంగ్ నాలుగు గోల్స్ (24వ ని.లో, 45+2వ ని.లో, 85వ ని.లో, 88వ ని.లో)... డాంగ్మే గ్రేస్ (53వ ని.లో, 86వ ని.లో) రెండు గోల్స్.. కష్మీనా (84వ ని.లో) ఒక గోల్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో 13న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. -
పాక్‌ను చిత్తు చేసిన భారత్
కఠ్మాండు (నేపాల్): ఆరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో (శాఫ్) బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున డాంగ్మే గ్రేస్ (23వ ని.లో), తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (90+4వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... అంతకుముందు పాకిస్తాన్ జట్టు చేసిన సెల్ఫ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఈనెల 10న మాల్దీవులు జట్టుతో ఆడుతుంది. -
దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నేపాల్ వేదికగా జరిగే దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టుకు సోమవారం పుణేలో ఐదురోజుల శిక్షణ శిబిరం మొదలైంది. సెప్టెంబర్ మూడో తేదీన భారత జట్టు నేపాల్‌కు వెళుతుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో నేపాల్, భూటాన్, శ్రీలంక జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. -
ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల
ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 షెడ్యూల్ ఇవాళ (జూన్ 15) అధికారికంగా విడుదలైంది. భారత్ రెండోసారి (2017, 2022) ఆతిధ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానుంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లతో అక్టోబర్ 30 వరకు సాగే ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు (24 మ్యాచ్‌లు) అక్టోబర్ 18 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు (4) అక్టోబర్ 21, 22 తేదీల్లో, సెమీస్ (2) అక్టోబర్ 26వ తేదీన (గోవా), ఫైనల్ మ్యాచ్(నవీ ముంబై) అక్టోబర్ 30న జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లకు (11, 14, 17) భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా -
నేటి నుంచి ఆసియా కప్ టోర్నీ.. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. 12 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్ నేడు ముంబైలో మొదలుకానుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్ నేడు ఇరాన్‌తో తలపడుతుంది. ఇరాన్‌తో గతంలో మూడుసార్లు ఆడిన భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు రన్నరప్‌గా (1979, 1983) నిలిచింది. -
44 మ్యాచ్‌ల తర్వాత...
టోక్యో: నాలుగుసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు 2016 రియో ఒలింపిక్స్ రన్నరప్ స్వీడన్ జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘జి’లో భాగంగా బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో అమెరికా 0–3 గోల్స్ తేడాతో స్వీడన్ చేతిలో ఓడింది. గత 44 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని అమెరికాకు స్వీడన్ రూపంలో పరాభవం తప్పలేదు. బ్లాక్స్టెనియస్ (25వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మరో గోల్‌ను లినా హర్టిగ్ (72వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు తమెక యలోప్ (20వ నిమిషంలో), స్యామ్ కెర్ (33వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను గబీ రెనీ (90+1వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో బ్రిటన్ 2–0 గోల్స్‌తో చిలీపై గెలుపొందింది. బ్రిటన్ తరఫున ఎలెన్ వైట్ (17వ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. గ్రూప్ ‘ఇ’లోనే జపాన్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. కెనడా ప్లేయర్ క్రిస్టినే (12వ నిమిషంలో) గోల్ చేయగా... జపాన్ క్రీడాకారిణి మనా ఇవబుచి (84వ నిమిషంలో) గోల్ చేసింది. గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన పోరుల్లో నెదర్లాండ్స్ 10–3తో జాంబియాపై, బ్రెజిల్ 5–0తో చైనాపై గెలిచాయి. ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా శుక్రవారం ఆ ఆరంభమ వుతాయి. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. మరోవైపు మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు కూడా బుధవారమే మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టు 8–1తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా... ఒలింపిక్స్ పోటీల ఆరంభ రోజు మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జాత్యహంకారానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. బ్రిటన్, చిలీ మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల క్రీడాకారిణులు మోకాలిపై కూర్చొని జాతి వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమెరికా, స్వీడన్ ప్లేయర్లు కూడా ఈ విధంగానే చేశారు. ఒలింపిక్స్ మొదలవ్వడానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. బుధవారం మొదటి రౌండ్ తొలి అంచె మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 12 జట్లు పోటీలో ఉండగా.... గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మూడు గ్రూప్‌లు (ఇ, ఎఫ్, జి)గా విభజించారు. ఫురుషుల విభాగంలో నేటి నుంచి మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఇందులో 16 జట్లు పాల్గొంటుండగా... నాలుగు టీమ్‌లు చొప్పున నాలుగు గ్రూప్‌లుగా (ఎ, బి, సి, డి) విభజించారు. తొలి రౌండ్లో భాగంగా ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన జట్లతో మూడేసి మ్యాచ్‌లను ఆడనుంది. -
వచ్చే ఫిబ్రవరిలో అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అండర్–17 మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. మంగళవారం ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ప్రపంచకప్ జరుగుతుందని ‘ఫిఫా’ ప్రకటించింది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. -
మహిళల యూరో 2022కి వాయిదా
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగాల్సిన మహిళల యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2022 జూలైకి వాయిదా పడింది. ఈ ఏడాది జరగాల్సిన పురుషుల యూరో టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో మహిళల ఈవెంట్ తేదీల్ని కూడా మార్చాల్సి వచ్చింది. దీనిపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్ఏ) అధ్యక్షుడు అలెగ్జాండర్ సెఫెరిన్ మాట్లాడుతూ మెగా ఈవెంట్లు ఒకేసారి గజిబిజీగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతోనే మహిళల ఈవెంట్‌ను కూడా వాయిదా వేశామని చెప్పారు. పైగా వచ్చే ఏడాదికి మారిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సాకర్ మ్యాచ్‌లు ఉన్నాయని... దీంతో ఒకే ఏడాది రెండు మహిళల ఈవెంట్లు సరికాదనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మహిళల సాకర్‌కు సముచిత ప్రాధాన్యమివ్వాలనే వాయిదా వేశామని సెఫెరిన్ అన్నారు. -
ఆతిథ్యం... ఆలస్యం
న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో మెగా ఈవెంట్ వాయిదా పడింది. భారత్ వేదికగా జరగాల్సిన అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) శనివారం ప్రకటించింది. ప్రాణాంతక వైరస్ కారణంగానే ఈ ఏడాది నవంబర్ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ప్రపంచకప్ టోర్నీని నిలిపివేస్తున్నామని ‘ఫిఫా కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్’ వెల్లడించింది. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. కాగా ‘ఫిఫా’ నిర్ణయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) స్వాగతించింది. ఈ నిర్ణయం తాము ముందుగా ఊహించిందేనని సమాఖ్య కార్యదర్శి కుశాల్ దాస్ పేర్కొన్నారు. ‘కరోనా కారణంగా మిగతా టోర్నీల్లాగే ఇది కూడా వాయిదా పడుతుందని ముందే ఊహించాం. ఫిఫా నిర్ణయాన్ని మేం కచ్చితంగా ఆమోదించాల్సిందే. ప్రజారోగ్యం, ఆటగాళ్ల భద్రత, అభిమానుల క్షేమం కోరి ఫిఫా ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఈ టోర్నీకి సంబంధించిన క్వాలిఫయింగ్ ఈవెంట్లు కూడా ఇంకా జరగాల్సి ఉన్నాయి. దీన్ని బట్టి ఈ టోర్నీ వచ్చే ఏడాది ఉంటుందని అనుకుంటున్నా’ అని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్ మ్యాచ్‌లకు కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై నగరాలు ఆతిథ్యమివ్సాల్సింది. మొత్తం 16 జట్లు తలపడే టోర్నీలో... ఆతిథ్య జట్టు హోదాలో భారత్ నేరుగా అర్హత పొందింది. అండర్–17 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనడం భారత్‌కిదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు అండర్–17 వరల్డ్‌కప్‌తో పాటు, ఆగస్టు–సెప్టెంబర్‌లో కోస్టారికా వేదికగా జరగాల్సిన అండర్–20 మహిళల ప్రపంచకప్‌నూ వాయిదావేయాలని వర్కింగ్ కమిటీ సూచించింది. -
అచీవ్మెంట్
మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుం టారని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! ఇండియా ఆడడం లేదని ఇండియాలో ఆడే స్టార్లే లేకుండా పోతారా?! అఫ్షాన్ ఆషిక్ ఇప్పుడు ఫుట్‌బాల్‌లో రైజింగ్ స్టార్. అయితే కశ్మీర్లో రాళ్లు విసిరిన అమ్మాయిగానే అఫ్షాన్ దేశమంతటికీ తెలుసు. చేత్తో ఫుట్‌బాల్ పట్టుకుని ఆటకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని అఫ్షాన్లా అస్సలు ఊహించుకోలేం. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని, నీలిరంగు చుడీదార్లో పోలీసుల మీదకు రాళ్లు విసురుతున్న అఫ్షాన్ గత ఏడాదికాలంగా అల్లరిమూకలంతటికీ ఒక ఫొటో ఐడెంటిటీ! నిరుడు ఏప్రిల్‌లో ఓ ఉదయం ఫుట్‌బాల్ ట్రైనింగ్‌కి వెళుతున్న కొంతమంది అమ్మాయిల టీమ్‌ని పోలీసులు అడ్డగించినప్పుడు ఆ టీమ్‌లోనే ఉన్న అఫ్షాన్ పోలీసులకు ఎదురు తిరిగింది. తన స్నేహితురాలిని ఓ పోలీసు అధికారి అసభ్యంగా మాట్లాడి, ఆమె చెంపపై కొట్టి జీపులో వెళ్లిపోతున్నప్పుడు ఆపుకోలేని కోపంతో పోలీసులపై అఫ్షాన్ రాళ్లు విసిరింది. అది చూసి దేశం నివ్వెరపోయి చూసింది. అప్పటివరకు.. అమ్మాయిల చేతుల్లో తుపాకుల్ని మాత్రమే చూసిన దేశం.. రాళ్లు విసురుతున్న ఒక అమ్మాయిని మొదటిసారిగా చూసింది! డెబ్భై ఏళ్లుగా జమ్మూకశ్మీర్‌లో యువకులు పోలీసులపైకి రాళ్లు విసిరే దృశ్యాన్ని ఈ దేశం చూస్తూనే ఉంది. అయితే వారిలో ఒక యువతిని చూడ్డం అదే తొలిసారి. ఎవరీ అమ్మాయి అని ఇంటిలిజెన్స్ ఆరా తీసినప్పుడు.. రాష్ట్రంలో ఉన్న బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్లలో అఫ్షాన్ ఒకరన్న విషయం బయటపడింది. ఫుట్బాల్ని కాలితో ఒడుపుగా తన్నడానికి శిక్షణ కావాలి. రాయిని గురి చూసి కొట్టడానికి కశ్మీర్‌లాంటి చోట్ల చిన్న కవ్వింపు ఎదురైతే చాలు. ‘రాయి విసిరిన అమ్మాయి’గా అఫ్షాన్ నలుగురి కళ్లలో పడగానే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అఫ్షాన్ కోచింగ్ తీసుకుంటున్న స్పోర్ట్స్ అకాడమీలో చేరడానికి వచ్చే అమ్మాయిల సంఖ్య రెట్టింపయింది. బాలీవుడ్ నుంచి ఓ నిర్మాత వచ్చి, ‘అథియాశెట్టిని హీరోయిన్గా పెట్టి నీ జీవిత కథ తీస్తానమ్మాయ్.. ఇంకెవ్వరికీ మాట ఇవ్వకు’ అని చెప్పి వెళ్లాడు కూడా! ఇప్పుడామె ‘ఇండియన్ ఉమెన్స్ లీగ్’లో ముంబై టీమ్‌కి ‘జమ్మూకశ్మీర్ ఉమెన్స్ స్క్వాడ్ అండ్ గోలీ’ కెప్టెన్.ఇవన్నీ మూమూలే. శబ్దం వస్తే ఎవరైనా తలతిప్పి చూస్తారు. అఫ్షాన్ వైపు దేశమంతా అలాగే తలతిప్పి చూసింది. అయితే కశ్మీర్ అమ్మాయిలు మాత్రం అఫ్షాన్ ఇన్స్పిరేషన్తో చేతుల్లోకి రాళ్లు తీసుకుంటున్నారు! జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు ‘స్టోన్ పెల్టర్స్’ అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా!! రాళ్లు విసిరే అమ్మాయిలను హ్యాండిల్ చెయ్యడానికి సెంట్రల్ పోలీస్ రిజర్వ్ ఫోర్స్ 500 మంది మహిళా కమెండోలను జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే దింపబోతోంది. మీదకు వచ్చిపడే రాళ్లతోనే తెలివైనవాళ్లు తమ చుట్టూ దుర్భేద్యమైన గోడను నిర్మించుకుంటారని పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో చెబుతుంటారు. అఫ్షాన్లాంటి అమ్మాయిలు మాత్రం అవసరమైతే ఇంటిగోడకు ఉన్న రాళ్లను కూడా పెకిలించి చేతిలోకి తీసుకుంటారు! ఉన్నది అద్దాల మేడ అని కూడా చూసుకోకుండా రాయి విసురుతారు. అది తెలివిలేకపోవడం కాదు. తమాయించుకోలేకపోవడం. కశ్మీర్.. భారతదేశపు అద్దాల మేడ. అద్దాల మేడ కాబట్టి లోపల ఉన్నవాళ్లు రాళ్లు విసరలేరు అనుకోడానికి లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ అఫ్షాన్ ఉంది. అఫ్షాన్ ఉన్నచోట ప్రతిఘటనా ఉంటుంది. ఆ రోజు ప్రశాంతంగా ఆమె ఫుట్‌బాల్‌ను అమెను ఆడుకోనిస్తే ఇప్పుడు కమెండోలు అవసరమయ్యేవారే కాదేమో?!అఫ్షాన్లానే మరో అమ్మాయి పదకొండేళ్ల నథానియా జాన్. ఇండియా ఫుట్‌బాల్ ఆడడం లేదని ఫుట్‌బాల్ టన్నెల్లోకి వెళ్లే అవకాశం ఇండియాకు లేకుండా పోతుందా? ఈ తమిళనాడు బాలిక భారతదేశపు తొలి అధికారిక మ్యాచ్ బాల్ క్యారియర్‌గా (ఒ.ఎం.బి.సి) రష్యాకు వెళ్లి వచ్చింది. ‘ఫిఫా’ ఆటోమోటివ్ భాగస్వామి కియా మోటార్స్.. 10–14 ఏళ్ల మధ్య వయసు గల ఫుట్‌బాల్ ప్లేయర్స్ నుంచి ఇండియా తరఫున ఒ.ఎం.బి.సి. విజేతగా గర్ల్స్‌లో నథానియాను ఎంపిక చేసింది. జూన్ 22న బ్రెజిల్–కోస్టారికా మధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 24వ మ్యాచ్‌లో నథానియా రెండు జట్ల ప్లేయర్లతో కలిసి ఫుట్‌బాల్ టన్నెల్ గుండా బరి వరకు వెళ్లి బంతిని అందించింది. వాళ్లతో ఫొటోలు దిగింది, వాళ్ల ఆటను చూసి ఆనందించింది. ఇండియా మురిసిపోడానికి ఫిఫాలో ఈ మాత్రం ‘ప్రాతినిధ్యం’ తక్కువేం కాదు. గ్రేట్ ఇండియన్ అచీవ్మెంట్! నథానియాలా ఫిఫాకు వెళ్లి రావడం మాత్రమే అచీవ్మెంట్ కాదు.. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎప్పటికైనా ఇంటర్నేషనల్ గేమ్‌లో ఆడాలని నథానియా అనుకుంటోంది. అదీ ఇండియా అచీవ్మెంట్! అఫ్షాన్ కూడా అంతే. కశ్మీర్ అమ్మాయే అయినా, రాళ్లు విసిరిన అమ్మాయే అయినా ఇండియాకు ఒక అచీవ్మెంట్. - మాధవ్ శింగరాజు -
భారత్ గోల్స్ వర్షం
ఇంచియూన్: అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడో ఒకసారి ఆడే అవకాశం లభించే భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆసియూ క్రీడల్లో తమ తొలి మ్యాచ్‌నే అదిరిపోయే స్థాయిలో మొదలుపెట్టింది. సస్మితా వూలిక్, మిడ్‌ఫీల్డర్ కవులాదేవి ఐదేసి గోల్స్‌తో చెలరేగడంతో ఆదివారం ఇంచియూన్‌లో జరిగిన గ్రూప్ ‘ఎ’ వ్యూచ్‌లో భారత్ 15-0 గోల్స్ తేడాతో వూల్దీవులపై ఘన విజయుం సాధించింది. వ్యూచ్ ఆరంభమైన ఐదు నిమిషాలకే భారత జట్టు ఖాతా తెరిచింది. అక్కడి నుంచి భారత్‌కు ఎదురే లేకుండా పోరుుంది. బాలా దేవి రెండు గోల్స్ చేయగా... బెంబెమ్ దేవి, ప్రమేశ్వొరీ దేవి, ఆశాలత దేవి ఒక్కో గోల్ సాధించారు. ఈ విజయుంతో భారత్ గ్రూప్ ‘ఎ’ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయుం చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’ నుంచి వుూడు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారుు. ఇక భారత్ తన తదుపరి వ్యూచ్‌ను 17న ఆతిథ్య దక్షిణ కొరియూతో ఆడుతుంది. 19న థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. ఆసియూ క్రీడలు ఈ నెల 19న అధికారికంగా ప్రారంభం కానున్నప్పటికీ.. ఫుట్‌బాల్ వ్యూచ్‌లు ఐదు రోజుల వుుందే మొదలయ్యూరుు.