వచ్చే ఫిబ్రవరిలో అండర్‌–17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌  | Under 17 Womens Football World Cup Will Be In Next February | Sakshi
Sakshi News home page

వచ్చే ఫిబ్రవరిలో అండర్‌–17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 

Published Wed, May 13 2020 3:29 AM | Last Updated on Wed, May 13 2020 3:29 AM

Under 17 Womens Football World Cup Will Be In Next February - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ వేదికగా ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన అండర్‌–17 మహిళల ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. మంగళవారం ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు ప్రపంచకప్‌ జరుగుతుందని ‘ఫిఫా’ ప్రకటించింది. మొత్తం ఐదు వేదికల్లో (కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, నవీ ముంబై, అహ్మదాబాద్‌) ఈ టోర్నీని నిర్వహించనుండగా... మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement