
ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2023 టోర్నీలో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 20) జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా నిలిచింది. మ్యాచ్ 29వ నిమిషంలో ఓల్గా క్యార్‌మోనా అద్భుతమైన గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేక ఓటమిపాలైంది.
ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించిన స్పెయిన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు కూడా ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. కెప్టెన్ ఓల్గా క్యార్‌మోనా సెమీఫైనల్లో, ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ చేసి స్పెయిన్‌ను గెలిపించింది. సెమీఫైనల్లో చేసిన గోలే ఓల్గా క్యార్‌మోనాకు అంతర్జాతీయ కెరీర్‌లో తొలి గోల్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment