ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 షెడ్యూల్ ఇవాళ (జూన్ 15) అధికారికంగా విడుదలైంది. భారత్ రెండోసారి (2017, 2022) ఆతిధ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానుంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లతో అక్టోబర్ 30 వరకు సాగే ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు (24 మ్యాచ్‌లు) అక్టోబర్ 18 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు (4) అక్టోబర్ 21, 22 తేదీల్లో, సెమీస్ (2) అక్టోబర్ 26వ తేదీన (గోవా), ఫైనల్ మ్యాచ్(నవీ ముంబై) అక్టోబర్ 30న జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లకు (11, 14, 17) భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది.
చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా
Comments
Please login to add a commentAdd a comment