under 17
-
FIFA 2022: భారత్‌లో అమ్మాయిల ‘కిక్’స్టార్ట్
భువనేశ్వర్: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్–17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్‌లో 2008 రన్నరప్ అమెరికాతో భారత్ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్ లో భారత్ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి. ఆసియా నుంచి భారత్‌తో పాటు చైనా, జపాన్... ఆఫ్రికా కాన్ఫెడరేషన్ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌కు ప్రతీ మ్యాచ్ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. -
ఫిఫా వరల్డ్ కప్ 2022 షెడ్యూల్ విడుదల
ఫిఫా అండర్ 17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022 షెడ్యూల్ ఇవాళ (జూన్ 15) అధికారికంగా విడుదలైంది. భారత్ రెండోసారి (2017, 2022) ఆతిధ్యమివ్వనున్న ఈ ప్రపంచ స్థాయి క్రీడా సంబురం అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానుంది. డబుల్ హెడర్ మ్యాచ్‌లతో అక్టోబర్ 30 వరకు సాగే ఈ క్రీడా వేడుకలో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు (24 మ్యాచ్‌లు) అక్టోబర్ 18 వరకు, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు (4) అక్టోబర్ 21, 22 తేదీల్లో, సెమీస్ (2) అక్టోబర్ 26వ తేదీన (గోవా), ఫైనల్ మ్యాచ్(నవీ ముంబై) అక్టోబర్ 30న జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ ఆడబోయే మూడు మ్యాచ్‌లకు (11, 14, 17) భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా -
అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ మళ్లీ వాయిదా!
పనాజీ: కరోనా మహమ్మారి మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణపై తన ప్రభావం చూపనుంది. భారత్ వేదికగా జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 మహిళల వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్–19 కారణంగా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. అయితే ఇది మరోసారి వాయిదా పడే అవకాశముందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వరల్డ్‌కప్ అర్హత టోర్నీలు కూడా ఇంకా ముగియలేదని, ఈ పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరగడం కష్టమని వ్యాఖ్యానించారు. ‘ఫిఫా’ వర్గాలు కూడా ఇదే ఆలోచిస్తున్నట్లుగా తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. ఆట కన్నా దానితో ముడిపడి ఉన్న వారి ఆరోగ్య భద్రతే తమకు ప్రధానమని ‘ఫిఫా’ అధికార ప్రతినిధి అన్నారు. -
‘అనంతే’ బాలికల ఫుట్‌బాల్ టోర్నీ విజేత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ‘అనంత’ జట్టే అండర్–17 బాలికల ఫుట్‌బాల్ విజేతగా నిలిచిందని స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, పీడీ విజయ తెలిపారు. సెప్టెంబర్ 28–30 వరకు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లీగ్ దశ నుంచి ప్రత్యర్థి జట్లను గోల్స్ ఏమీ చేయనీయకుండా మన బాలికలు సత్తా చాటారన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో 2–0 తో కర్నూలు జట్టును ఓడించడం ద్వారా విజయాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. వీరు జాతీయస్థాయిలో రాణించి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. విజేతలను డీవీఈఓ సుభాకర్, పీడీ మనోహర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే అండర్-17 రాష్ట్రస్థాయి బాలుర జట్టును సోమవారం ప్రకటించారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేశ్ రెడ్డి జట్టు సభ్యుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు (పీఈటీఏ)రాఘవ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పీఈటీఏ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. జట్టు: ఆర్.బాలరాజు, చిన్న, శ్రీశైలం, నవీన్, వంశీ, విజయ్, ఉదయ్, భాస్కర్, అభినవ్, అజయ్, సంతోశ్, లోకేశ్, ఎ.వంశీ, రాజేశ్, రాహుల్, ఎం.అజయ్, విశాల్, ఆకాశ్, వేణుగోపాల్, అభిషేక్, ప్రసాద్, నరేశ్ కుమార్. -
అండర్-17 ప్రపంచకప్‌కు డైరెక్టర్ల నియామకం
న్యూఢిల్లీ: భారత్‌లో 2017లో జరుగనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌కు నిర్వాహక కమిటీ డైరెక్టర్లను నియమించింది. టోర్నమెంట్ డైరెక్టర్‌గా జేవియర్ సెప్పి, ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా జాయ్ భట్టాచార్యను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. గత నెల్లో ఇంటర్వ్యూ ప్యానెల్ షార్ట్‌లిస్ట్ చేయగా.. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తుది నియామకాలకు ఆమోద ముద్ర వేశారు. 2017లో జరిగే అండర్-17 ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్‌గా ఎంపికైన జేవియర్ గత ఏడాది యూఏఈలో జరిగిన వరల్డ్‌కప్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. చైనాలో జరగనున్న 2015 అండర్-17 ప్రపంచకప్‌కూ ఆయన టోర్నీ డైక్టర్గా వ్యవహరించనున్నారు.