
లండన్: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరగాల్సిన మహిళల యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ 2022 జూలైకి వాయిదా పడింది. ఈ ఏడాది జరగాల్సిన పురుషుల యూరో టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో మహిళల ఈవెంట్ తేదీల్ని కూడా మార్చాల్సి వచ్చింది. దీనిపై యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఈఎఫ్‌ఏ) అధ్యక్షుడు అలెగ్జాండర్ సెఫెరిన్ మాట్లాడుతూ మెగా ఈవెంట్లు ఒకేసారి గజిబిజీగా ఉంటే బాగుండదనే ఉద్దేశంతోనే మహిళల ఈవెంట్‌ను కూడా వాయిదా వేశామని చెప్పారు. పైగా వచ్చే ఏడాదికి మారిన టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సాకర్ మ్యాచ్‌లు ఉన్నాయని... దీంతో ఒకే ఏడాది రెండు మహిళల ఈవెంట్లు సరికాదనే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మహిళల సాకర్‌కు సముచిత ప్రాధాన్యమివ్వాలనే వాయిదా వేశామని సెఫెరిన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment