ప్రపంచకప్‌ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన టీమిండియా | FIFA U17 Womens World Cup: India End Campaign With Defeat Against Brazil | Sakshi
Sakshi News home page

FIFA U17 Womens World Cup: ప్రపంచకప్‌ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన భారత్‌

Published Tue, Oct 18 2022 7:02 PM | Last Updated on Tue, Oct 18 2022 7:02 PM

FIFA U17 Womens World Cup: India End Campaign With Defeat Against Brazil - Sakshi

అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌-2022లో భారత చాప్టర్‌ క్లోజ్‌ అయ్యింది. టోర్నీ మొత్తంలో భారత అమ్మాయిలు ఒక్క గోల్‌ కూడా కొట్టకుండా నిష్క్రమించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్ధులకు దాసోహమయ్యారు. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0-8 తేడాతో ఓటమిపాలైన భారత అమ్మాయిలు, ఆతర్వాత మొరాకో చేతిలో 0-3 తేడాతో.. చివరి మ్యాచ్‌లో బ్రెజిల్‌ చేతిలో 0-5 తేడాతో చిత్తయ్యారు. ఆతిధ్య జట్టు హోదాలో మెగా టోర్నీకి అర్హత సాధించిన భారత కనీస పోటీ కూడా ఇవ్వకుండా, పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. 

టోర్నీలో ప్రస్తుత పరిస్ధితి విషయానికొస్తే.. గ్రూప్‌-ఏలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ఆఖరి స్థానంలో నిలువగా.. అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్‌, మొరాకో జట్లు 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. చెరి నాలుగు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి. గ్రూప్‌-బి నుంచి జర్మనీ, నైజీరియా.. గ్రూప్‌-సి నుంచి కొలొంబియా, స్పెయిన్‌.. గ్రూప్‌-డి నుంచి జపాన్‌, టాంజానియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement