
కట్మండు: దక్షిణాసియా సీనియర్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 2–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment