Soumya Guguloth
-
ఉజ్బెకిస్తాన్‌తో.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు సౌమ్య!
తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్ నగరంలో ఉజ్బెకిస్తాన్ జట్టుతో మే 31, జూన్ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.30 మంది ప్రాబబుల్స్‌కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్‌లోని శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్ కప్ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.ఇవి చదవండి: నాలుగో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ.. -
భారత ఫుట్‌బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి
నాలుగు దేశాల మధ్య జరిగే టర్కిష్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ పాల్గొనే భారత సీనియర్ జట్టును ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్ సౌమ్య గుగులోత్‌కు స్థానం దక్కింది. బుధవారం టర్కీలోని అలాన్యా పట్టణంలో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత్, హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాల మధ్య రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగుతుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. భారత్ తమ మ్యాచ్‌లను 21న ఎస్టోనియాతో, 24న హాంకాంగ్‌తో, 27న కొసోవోతో ఆడుతుంది. చదవండి: Aryna Sabalenka Life Story: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’! నిజమే మరి! -
‘డైనమో జాగ్రెబ్’ జట్టులో సౌమ్య
భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన గుగులోత్ సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. క్రొయేషియాకు చెందిన ప్రతిష్టాత్మక క్లబ్ ‘డైనమో జాగ్రెబ్’ తరఫున ఆమె ఆడనుంది. దీనికి సంబంధించి ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుంది. సౌమ్యతో పాటు మరో భారత ప్లేయర్ జ్యోతి చౌహాన్‌ను కూడా జాగ్రెబ్ క్లబ్ ఎంచుకుంది. ఈ టీమ్‌తో జత కట్టిన తొలి విదేశీ ఆటగాళ్లుగా వీరిద్దరు గుర్తింపు పొందారు. క్రొయేషియాలోనే జరిగిన ట్రయల్స్‌లో సత్తా చాటి వీరిద్దరు ఆ అవకాశం దక్కించుకున్నారు. ఇద్దరూ కూడా భారత దేశవాళీ మహిళల లీగ్‌లో గోకులమ్ ఎఫ్‌సీకే ప్రాతినిధ్యం వహించారు. క్రొయేషియాలో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన డైనమో జాగ్రెబ్ 46 ట్రోఫీలు గెలుచుకుంది. చదవండి: Japan Open 2022: ముగిసిన శ్రీకాంత్ పోరాటం.. బరిలో మిగిలింది ఒకే ఒక్కడు -
దక్షిణాసియా ఫుట్‌బాల్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: వచ్చే నెలలో నేపాల్ వేదికగా జరిగే దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత జట్టుకు సోమవారం పుణేలో ఐదురోజుల శిక్షణ శిబిరం మొదలైంది. సెప్టెంబర్ మూడో తేదీన భారత జట్టు నేపాల్‌కు వెళుతుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్ ‘ఎ’లో మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో నేపాల్, భూటాన్, శ్రీలంక జట్లున్నాయి. లీగ్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 19న ఫైనల్ జరుగుతుంది. -
యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు సౌమ్య..
Soumya Guguloth: వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్లలో పర్యటించే భారత మహిళల సీనియర్ ఫుట్‌బాల్ జట్టును సోమవారం ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా వచ్చే నెల 2న యూఏఈతో, 4న ట్యూనిషియాతో, 10న బహ్రెయిన్‌తో, 13న చైనీస్ తైపీతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: David Warner: మళ్లీ కనిపించకపోవచ్చు.. కానీ సపోర్టు చేయండి.. అన్నా అలా అనొద్దు! -
భారత మహిళల ఫుట్‌బాల్ శిబిరానికి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్ టోర్నమెంట్ సన్నాహాల కోసం భారత సీనియర్ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ థామస్ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్–17, అండర్–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది. -
‘సౌమ్య’.. గ్రౌండ్లోకి దిగితే చిచ్చరపిడుగే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పేరులోనే ‘సౌమ్య’.. గ్రౌండ్లోకి దిగితే చిచ్చరపిడుగే.. కృషి, పట్టుదలతో ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తోన్న గుగులోత్ సౌమ్య.. పందొమ్మిదేళ్లకే భారత సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఈ నెల 14 నుంచి టర్కీలో జరిగే అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆడనుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును బుధవారం ప్రకటించగా, అందులో సౌమ్య చోటు సంపాదించింది. 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన క్రీడాకారిణిగానూ సౌమ్య ఘనత సాధించింది. సౌమ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కిసాన్‌నగర్ తండా. నిజామాబాద్ కేర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తండ్రి గుగులోత్ గోపి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి ధనలక్ష్మి గృహిణి. ఇద్దరు అక్కలు, తమ్ముడు ఉన్నారు. అండర్–14 నుంచి.. నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారిగా ఆడిన సౌమ్య.. ఆపై చైనాలో అండర్ 16, మయన్మార్‌లో అండర్ 19 పోటీల్లో ఆడి ప్రతిభ చాటింది. దక్షిణాఫ్రికాలో 2019లో జరిగిన అండర్ 17 పోటీల్లో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించింది. భారత సీనియర్ మహిళల జట్టులో చోటు కోసం 11 నెలలు ప్రాక్టీస్ చేసింది. లాక్డౌన్లో క్రీడా ప్రాంగణాలన్నీ మూసివేసినా.. ప్రత్యేక అనుమతితో నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసింది. సోదరి వివాహానికీ హాజరుకాకుండా ప్రాక్టీస్‌ను కొనసాగించిందని కోచ్ నాగరాజు ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. వేగమే ఆమె బలం.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో సౌమ్య కదలికలు చాలా వేగంగా ఉంటాయి. సీనియర్ జట్టులో చోటు కోసం కఠోరంగా శ్రమించింది. రోజూ ఆరు గంటల పాటు ప్రాక్టీస్ చేసేది. ఎలాగైనా గోల్ కొట్టాలనే కసి, అగ్రెసివ్నెస్ ఆమెకు కలిసొస్తున్నాయి. – గొట్టిపాటి నాగరాజు, కోచ్ నమ్మలేకపోయా.. భారత సీనియర్ జట్టుకు ఎంపికైనట్టు సౌమ్య ఉదయం ఫోన్‌చేసి చెప్పింది. మొదట నమ్మలేదు. జట్టులో చోటుకోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది సీనియర్లు పోటీపడతారు. అలాంటి జట్టుకు నా కుమార్తె ఎంపిక కావడం గర్వకారణం. – గుగులోత్ గోపి, సౌమ్య తండ్రి చిన్న వయసులోనే.. ఆటలో మాకంటే ప్రతిభ చూపడం వల్లే సౌమ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. సౌమ్య భారత సీనియర్ మహిళల జట్టులో చిన్న వయసులోనే చోటు సంపాదించింది. – మేఘన, ఫుట్‌బాల్ క్రీడాకారిణి