
నాలుగు దేశాల మధ్య జరిగే టర్కిష్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్ టోర్నీ పాల్గొనే భారత సీనియర్ జట్టును ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్ సౌమ్య గుగులోత్‌కు స్థానం దక్కింది.
బుధవారం టర్కీలోని అలాన్యా పట్టణంలో ఈ టోర్నీ మొదలవుతుంది. భారత్, హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాల మధ్య రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. భారత్ తమ మ్యాచ్‌లను 21న ఎస్టోనియాతో, 24న హాంకాంగ్‌తో, 27న కొసోవోతో ఆడుతుంది.
చదవండి: Aryna Sabalenka Life Story: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’! నిజమే మరి!