భారత మహిళల ఫుట్‌బాల్‌ శిబిరానికి సౌమ్య | Soumya Gugulothfor Indian womens football camp | Sakshi
Sakshi News home page

భారత మహిళల ఫుట్‌బాల్‌ శిబిరానికి సౌమ్య

Published Sat, Aug 14 2021 5:51 AM | Last Updated on Sat, Aug 14 2021 5:51 AM

Soumya Gugulothfor Indian womens football camp - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్‌ కాన్ఫడరేషన్‌ (ఏఎఫ్‌సీ) ఆసియా కప్‌ టోర్నమెంట్‌ సన్నాహాల కోసం భారత సీనియర్‌ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ థామస్‌ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్‌–17, అండర్‌–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా భారత సీనియర్‌ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement