శ్రీలంకపై భారత్ గెలుపు
తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 2-0తో ఓడించింది. త్రివేండ్రం అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రాబిన్ సింగ్ చేశాడు. ప్రథమార్ధం హోరాహోరీగా సాగినా ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది.
ఫలితంగా 51వ నిమిషంలో సునీల్ చెత్రి పాస్‌ను రాబిన్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో చెత్రి హెడర్‌తో పంపిన బంతిని రాబిన్ మరోసారి గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు.