జయహో జయంత్ | special story to cricketer jayanth | Sakshi
Sakshi News home page

జయహో జయంత్

Published Thu, Dec 1 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

జయహో జయంత్

జయహో జయంత్

రెండు టెస్టుల్లో సత్తా చాటిన ఆల్‌రౌండర్
దేశవాళీలోనూ ఘనమైన రికార్డు
జట్టులో రెగ్యులర్‌గా మారే అవకాశం  

సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడి అలిస్టర్ కుక్ వికెట్ తీసినప్పుడు అతనికి తెలీదు... నాలుగేళ్ల తర్వాత అదే కుక్ సారథ్యంలోని జట్టును తన స్పిన్‌తో దెబ్బ తీస్తానని. మూడేళ్ల క్రితం ప్రత్యేక శిక్షణలో భాగంగా చెన్నైకి వెళ్లి అశ్విన్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటూ రెండు వారాల ట్రైనింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేసినప్పుడు అతనికి తెలీదు... మూడేళ్ల తర్వాత అదే అశ్విన్‌తో కలిసి తాను అద్భుతం చేస్తానని. అనూహ్యంగా లభించిన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్న 26 ఏళ్ల జయంత్ యాదవ్ ఇప్పుడు జట్టులోంచి తనను తప్పించలేని పరిస్థితిని సృష్టించాడు.

విశాఖపట్నంలో ఆడిన తొలి టెస్టులో 4 వికెట్లు తీయడంతో పాటు జయంత్ చేసిన 35, 27 నాటౌట్ స్కోర్లు అతనికి బ్యాటింగ్ వచ్చనే అభిప్రాయాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌లో కలిగిస్తే, మొహాలీలో మరో 4 వికెట్లతో పాటు కీలక సమయంలో చేసిన అర్ధసెంచరీ ఆ నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా ఈ రెండు టెస్టులలో కీలక సమయాల్లో స్టోక్స్, రూట్, బెరుుర్‌స్టోలాంటి బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడంతో అతను మన వరుస విజయాల నంబర్‌వన్ టీమ్‌లో ప్రధాన భాగంగా మారిపోయాడు. మొహాలీ టెస్టులో అచ్చమైన టెస్టు బ్యాట్స్‌మన్‌లా ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారికంగా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే కాబోలు తొలి టెస్టు తర్వాత విరాట్ ‘అమూల్యమైన’ ఆటగా జయంత్ ప్రదర్శనను ప్రస్తుతించాడు.

లెగ్‌స్పిన్ నుంచి ఆఫ్‌స్పిన్ వైపు
విశాఖపట్నంలో జయంత్ తన తొలి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లంతా తమ తల్లుల పేర్లను జెర్సీలపై ధరించారు. అతడికి ఇచ్చిన జెర్సీపై తల్లి పేరు లక్ష్మీ అని రాసి ఉంది. నిజానికి అతని తల్లి 17 ఏళ్ల క్రితమే చనిపోరుుంది. తనను ఈ స్థారుుకి తీసుకు వచ్చింది తన ‘రెండో అమ్మ’ జ్యోతి యాదవ్ అని చెప్పుకున్న జయంత్... పొరపాటున ఆమె పేరు రాయలేదని, కానీ తన గుండెల్లో ఉంటావంటూ కెమెరా ముందు మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. సాధారణ నేపథ్యం ఉన్న చాలా మంది కుర్రాళ్లలాగే జయంత్ కూడా చిన్నప్పుడు గల్లీల్లోనే క్రికెట్‌ను ఆరంభించాడు. అక్కడ అతను లెగ్‌స్పిన్ వేసేవాడు. అరుుతే అతనికంటే పెద్దవారైన ఇద్దరు కజిన్‌‌స కూడా లెగ్ స్పిన్నర్లే. దాంతో వారు అతడిని పిలిచి ఇలా కాదు, ఒకే ఇంట్లో ముగ్గురు లెగ్‌స్పిన్నర్లు కుదరదు, నువ్వు మారాల్సిందే అంటూ తేల్చేశారు. దాంతో తాను అప్పుడు ఆఫ్‌స్పిన్‌ను ఎంచుకున్నట్లు జయంత్ చెప్పాడు. హరియాణా జట్టు తరఫున వివిధ వయో విభాగాల స్థారుులో రాణిస్తూ నెమ్మదిగా అతను పైకి ఎదిగాడు. ఇదే క్రమంలో తన బ్యాటింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంటూ వచ్చాడు.

రంజీల్లో నిలకడ
21 ఏళ్ల వయసులో గుజరాత్‌పై తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన జయంత్ ఆరు వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరుుతే ఆ తర్వాత మిగిలిన సీజన్ మొత్తం విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఏడాది జయంత్ బ్యాటింగ్ పదును క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (211)తో చెలరేగిన అతను... అమిత్ మిశ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థారుులో 392 పరుగులు జోడించాడు. 2014-15 సీజన్‌లో 33 వికెట్లతో ఆకట్టుకున్న అతను తర్వాతి ఏడాది ఒక మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 13 వికెట్లు తీయడంతో భారత ‘ఎ’ జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఎంపికై నా పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో గత ఏడాది కూడా అద్భుత ప్రదర్శనతో జయంత్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

ఆకట్టుకునే ఆరంభం
జయంత్ ముందుగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ లెగ్‌స్పిన్నర్ చహల్‌పై కెప్టెన్ ధోని నమ్మకం ఉంచడంతో అతనికి మ్యాచ్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండు మ్యాచ్‌లలో 7 వికెట్లు తీయడం, ఇరానీ కప్ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడంతో కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం చోటు దక్కింది. చివరకు విశాఖలో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జయంత్, ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన హరియాణా సీనియర్ అమిత్ మిశ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జయంత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటంలో సఫలమయ్యాడు. అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న తీరు, పేసర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను చక్కగా అంచనా వేసిన విధానం బ్యాట్స్‌మన్‌గా అతనికి మంచి మార్కులు వేశారుు. అశ్విన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడం జట్టుకు కలిసొచ్చింది. ‘అతని ఆట చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. సానుకూల దృక్పథంతో జయంత్ బ్యాటింగ్ చేశాడు. దాంతో మా భాగస్వామ్యం మరింత బాగా కొనసాగింది’ అని అశ్విన్ ఆ ఇన్నింగ్‌‌స గురించి వ్యాఖ్యానించాడు. మొరుున్ అలీని తొలి వికెట్‌గా సాధించడంలో డీఆర్‌ఎస్‌ను కచ్చితత్వంతో వినియోగించిన తీరు, హమీద్ రనౌట్ కూడా జయంత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టారుు. ఇక మూడో టెస్టులోనైతే అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ టెస్టులో రూట్, బెరుుర్‌స్టోల వికెట్లు తీసిన బంతులు జయంత్ ప్రతిభకు మచ్చుతునకలు.

జోరు కొనసాగిస్తాడా..?
రాజ్‌కోట్‌లో డ్రా తర్వాత వైజాగ్‌లో మిశ్రాను కాదని కోహ్లి... జయంత్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చారుు. అందరినీ ఈ నిర్ణయం ఆశ్చర్యపరచింది. ప్రత్యర్థి జట్టులో ఏడుగురు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటంతో రెండో ఆఫ్‌స్పిన్నర్‌ను కోహ్లి ఎంచుకున్నాడు. అక్కడి ప్రదర్శన అతనికి మరో అవకాశం ఇప్పించింది. ప్రతీసారి ఇదీ సాధ్యమేనా అంటే సందేహమే అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అశ్విన్ జట్టులో ఉన్నాడు. అతను ఉండగా సాధారణంగా మరో ఆఫ్‌స్పిన్నర్‌కు అవకాశమే ఉండదు. ఇటీవల అశ్విన్ పూర్తి స్థారుు బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్నాడు. అన్నింటికి మించి జయంత్ శైలి అచ్చుగుద్దినట్లు అశ్విన్‌నే పోలి ఉంటుంది. కాబట్టి మున్ముందు జయంత్‌ను ఈ సమీకరణం ఇబ్బంది పెట్టవచ్చు. ఆడిన ఒకే ఒక వన్డేలో అతని పూర్తి సామర్థ్యం బయటపడలేదు. కాబట్టి తాజా ప్రదర్శన ఒక్కటే జయంత్‌కు భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేదు. అరుుతే ఏ ఆటగాడైనా తనకు దక్కిన అవకాశాలను పూర్తి స్థారుులో సద్వినియోగం చేసుకోవడమే అతని చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జయంత్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కాబట్టి అతను ఇక ముందు తన సత్తాను చాటాలని, మరింత పట్టుదలతో రాణించాలని ఆశిద్దాం.     -సాక్షి క్రీడా విభాగం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement