అలిస్టర్ కుక్ (PC: Essex Cricket)
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటన చేశాడు. కాగా 2018లో టీమిండియాతో ఓవల్ మ్యాచ్ తర్వాత కుక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.
భారత జట్టుతో నాటి మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో 71, 147 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. కౌంటీల్లో ఎసెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 2019నాటి చాంపియన్‌షిప్‌లో టీమ్‌ను విజేతగా నిలిపాడు.
అప్పుడు చాంపియన్.. కానీ ఈసారి
తాజా చాంపియన్‌షిప్‌లో 14 మ్యాచ్‌లు ఆడి.. ఒక సెంచరీ, ఆరు అర్ధ శతకాల సాయంతో 836 పరుగులు సాధించిన కుక్.. ఎసెక్స్‌కు మరోసారి టైటిల్ అందించలేకపోయాడు. ఈసారి సర్రే టీమ్ విజేతగా నిలవగా.. ఎసెక్స్ రెండోస్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఎసెక్స్ సోషల్ మీడియా వేదికగా అలిస్టర్ కుక్ తన నిర్ణయాన్ని అభిమానులకు తెలియజేశాడు.
‘వీడ్కోలు పలకడం అంత సులభం కాదు. క్రికెట్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నేనెన్నడూ ఊహించని ప్రదేశాలకు వెళ్లడం సహా.. అక్కడి వాళ్లతో అనుబంధాలు పెంపొందించుకోవడం ఆట వల్లే సాధ్యమైంది.
కలలో కూడా ఊహించని ఎన్నో విషయాలను నేను సాధించగలిగాను. ఎనిమిదేళ్ల వయసులో అండర్-11 జట్టులో ఆడిన నాటి నుంచి.. ఇప్పటి దాకా.. ఒకింత గర్వం.. అంతకు మించిన బాధతో..
కుక్ భావోద్వేగం
భిన్న భావోద్వేగాల సమాహారంతో ఆటకు వీడ్కోలు చెబుతున్నా. అయితే, జీవితాంతం గుర్తుపెట్టుకునే జ్ఞాపకాలను ఆట నాకు మిగిల్చింది.. నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను’’ అంటూ 38 ఏళ్ల అలిస్టర్ భారమైన హృదయంతో బ్యాటర్‌గా శాశ్వతంగా ఆటకు దూరమయ్యాడు. కాగా ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన కుక్‌ను ఉద్దేశించి.. ‘‘ఒక శకం ముగిసిపోయింది..’’ అంటూ అతడికి ధన్యవాదాలు తెలిపింది ఎసెక్స్ యాజమాన్యం.
ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే
కాగా ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్లలో ఒకడిగా అలిస్టర్ కుక్ పేరొందాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో 12400 పరుగులు సాధించి.. ఆల్‌టైమ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కుక్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 352 మ్యాచ్‌లలో 26,643 పరుగులు చేశాడు. ఇందులో 74 సెంచరీలు ఉన్నాయి. ఇక 2006లో భారత్ వేదికగా టీమిండియాతో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుక్.. సొంతగడ్డపై టీమిండియాతోనే తన చివరి మ్యాచ్ ఆడటం విశేషం.
చదవండి: పాకిస్తాన్‌తో మ్యాచ్.. గుడ్‌న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ! ఇషాన్ అవుట్.. కానీ!
Comments
Please login to add a commentAdd a comment