ప్రేమ విఫలం... బలవన్మరణం | Two youths were Forceful death in both incidents | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలం... బలవన్మరణం

Published Thu, Aug 29 2024 4:42 AM | Last Updated on Thu, Aug 29 2024 4:42 AM

Two youths were Forceful death in both incidents

రెండు ఘటనల్లో ఇద్దరు యువకుల అఘాయిత్యం 

నెక్కొండ/శాంతినగర్‌: ప్రేమ విఫలం కావడంతో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్‌ జిల్లా నెక్కొండ ఎస్‌ఐ మహేందర్‌ తెలిపిన ప్రకారం.. నెక్కొండకు చెందిన చింతల జయంత్‌ (22) ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలని జయంత్‌ను యువతి తల్లిదండ్రులు మందలించారు. 

యువతి సైతం అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ నెల 27న తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జయంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

వీడియో తీసి.. సూసైడ్‌ నోట్‌ రాసి.. 
ప్రేమించి మోసపోవద్దని, తాను మోసపోయి ఆ త్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జోగులాంబ–గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలెకల్‌ స్టేజీకి చెందిన తెలిగి అశోక్‌ (22) మంగళవారం రాత్రి కర్నూలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు.. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, యువతి తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నందున తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, తన చావుకు కారణమైన వారిని వదలొద్దంటూ వీడియోలో పేర్కొన్నాడు. 

సూసైడ్‌ నోట్‌ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బుధవారం అశోక్‌ మృతదేహాన్ని తీసుకొ చ్చి అలంపూర్‌–రాయచూర్‌ రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేస్తామని సీఐ రవిబాబు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement