అంజలీకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిందెవరు?
అంజలీకి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ ఇచ్చిందెవరు?
Published Mon, Jul 21 2014 6:43 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
కోనసీమ అందాల భామ అంజలి కోలీవుడ్, టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఇతర భాషాల నుంచి దిగుమతైన తారలకు గట్టి పోటీ ఇచ్చిన అంజలి తాజాగా గీతాంజలీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. గీతాంజలీ చిత్ర ఆడియో కార్యక్రమంలో అందర్నీ ఆకర్షించిన అంజలీ.. తాజాగా మీడియాలో హైలెట్ గా నిలిచింది.
లేటెస్ట్ గా అంజలీ ఓ బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారును తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్నారని ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా వెబ్ సైట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. కోన వెంకట్ పోస్ట్ చేసిన అంజలీ ఫోటో మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే తనకు తాను గిఫ్ట్ గా ఇచ్చుకున్నారనే అంశం చర్చనీయాంశమైంది.
Advertisement
Advertisement