అంజలికి స్పెషల్
అంజలి భయపెట్టబోతోంది. అలాగే నవ్వించబోతోంది. తను ఒకేసారి భయాన్నీ, వినోదాన్నీ ఎలా కలిగిస్తుందంటే... ‘గీతాంజలి’ చూడాల్సిందే అంటున్నారు రచయిత కోన వెంకట్. ఆయన సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’. అంజలికి ఇది తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. రాజకిరణ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.వి.వి.సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. కోనవెంకట్ మాట్లాడుతూ -‘‘అనుష్కకు ‘అరుంధతి’లా, జ్యోతికకు ‘చంద్రముఖి’లాగా అంజలి కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా నిలిచే సినిమా ఇది. ఎవ్వరూ ఊహించని విధంగా కథాకథనాలు ఉంటాయి. నాదైన శైలిలో వినోదానికి ప్రాధాన్యముంటుంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ కామెడీ చిత్రాల్లోనే ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. బ్రహ్మానందంగారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అని తెలిపారు.
నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ- ‘‘ఇప్పటికి 80శాతం సినిమా షూటింగ్ పూర్తయింది. జూన్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే అతిథి పాత్ర చేస్తున్నారు. బ్రహ్మానందం, రావు రమేశ్, మధునందన్, షకలక శంకర్, సత్యం రాజేశ్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, యాక్షన్: విజయ్, ఆర్ట్: రఘుకులకర్ణి, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: వి.ఎస్.ఎన్. కుమార్.