బాబోయ్‌ దెయ్యం.. | devil of heroine anjali new house | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ దెయ్యం..

Published Fri, Apr 28 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

బాబోయ్‌ దెయ్యం..

బాబోయ్‌ దెయ్యం..

టీనగర్‌: నటి అంజలి దెయ్యం భయంతో తానుంటున్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి చేరడం సంచలనం కలిగించింది. తమిళ, తెలుగు చిత్రాల్లో అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివశిస్తూ వచ్చారు. నాగార్జున కుమారుడు నటుడు నాగచైతన్య ఇంటి సమీపంలో ఈమె ఇల్లు కూడా ఉండేది. ఇటీవలి కాలంగా అంజలి ఇంటి సమీపంలో పిల్లులు అధిక సంఖ్యలో సంచరించినట్లు, రాత్రి సమయాల్లో వింతవింత శబ్ధాలు వినిపించినట్లు సమాచారం.

దీంతో అంజలి భయాందోళనలకు గురైంది. తెలుగులో గీతాంజలి అనే దెయ్యం చిత్రంలో ఆమె నటించారు. ఆ చిత్రంలోని సంఘటనలాగే ఇది ఉన్నట్లు భావించారు. తన ఇంట్లో ఒకవేళ దెయ్యం సంచరిస్తుందేమో అని భావించిన ఆమె హఠాత్తుగా ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరారు. త్వరలో సొంతగా హైదరాబాద్‌లో ఒక బంగళా, లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు అంజలి నిర్ణయించారు. ప్రస్తుతం జైకు జంటగా బెలూన్‌ చిత్రంలో నటించారు. అంజలి, జై ప్రేమించుకుంటున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement