
దేశవాళీ వినోదం
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి’ చిత్రంతో హీరోగా మారారు. మళ్లీ ఆయన కథానాయకునిగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ ఫిలింస్ పతాకంపై శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పూర్ణ కథానాయిక. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ-‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే చిత్రాలను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటారు.
మా చిత్రం చూస్తే సమైక్యంగా నవ్వుకుందాం అంటారు. ఈ సినిమాలోని కామెడీకి ‘దేశవాళీ వినోదం’ అని నామకరణం చేశా. రీ రికార్డింగ్ కాకపోయినా రష్ చూసి, సుకుమార్‌గారు నా దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తానని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అని చెప్పారు. ‘‘పూర్తి స్థాయి నవ్వులు పంచే చిత్రమిది. నా కెరీర్‌కు గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చిత్ర సమర్పకులు ఏవీఎస్ రాజు, కెమెరామెన్ నగేష్ బానెల్, ఎడిటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్, లైన్ ప్రొడ్యూసర్: రామ్మంతెన (మధు), సహ నిర్మాత: సతీష్ కనుమూరి.