
కరీంనగర్ టు కాకినాడ
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా తర్వాత మరోసారి ఆయన కథానాయకునిగా నటించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. పూర్ణ కథానాయిక. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర సమర్పకులు ఏవీయస్ రాజు మాట్లాడుతూ - ‘‘కరీంనగర్ నుంచి కాకినాడ వెళ్లిన ఓ యువకుడి చుట్టూ సరదాగా సాగే కథ ఇది.
పూర్తి స్థాయి వినోదభరితంగా ఉంటుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైజాగ్, భీమిలీ, కాకినాడ, పోచంపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ సహకరించడంతో అనుకున్న టైమ్‌లో చిత్రీకరణ పూర్తయింది. అన్నివర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నేల్, సహ నిర్మాత: సతీష్ కనుమూరి.