
టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా హీరోగా దూసుకుపోతున్న శ్రీనివాస్ రెడ్డికి మళ్లీ పెళ్లి. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే నిజం పెళ్లి కాదులెండి. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సంచలన విజయం సాధించిన జంబ లకిడి పంబ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కమెడియన్ గా కొనసాగుతూనే హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాతో పాటు అనసూయతో కలిసి ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలోనూ నటిస్తున్నాడు.
Malli Pelli 🙈 #jambalakidipambamovie @Siddhi_Blue pic.twitter.com/aeEfPrLjUd
— Srinivasareddy (@Actorysr) 5 January 2018