ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..? | Kona venkat next movie title patala bhairavi | Sakshi
Sakshi News home page

ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?

Published Sun, Dec 6 2015 1:33 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?

ఈ సారి పాతాళ భైరవి తీస్తాడట..?

రచయితగా టాప్ క్రేజ్ సొంతం చేసుకున్న కోన వెంకట్కి ప్రస్తుతం కాలం అంతగా కలిసి రావటం లేదు. శ్రీనువైట్లతో వివాదం, ఆ తరువాత ఈ ఇద్దరు మళ్లీ మనసు మార్చుకొని చేసిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచటంతో ఇటీవల సక్సెస్లతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు కోన. అదే సమయంలో నిర్మాతగా మారి ఒకప్పటి క్లాసిక్ టైటిల్స్తో సినిమాలను నిర్మిస్తున్నాడు.

తొలి ప్రయత్నంగా గీతాంజలి పేరుతో ఓ హార్రర్ కామెడీని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. అదే జోష్లో మరో క్లాసిక్ శంకరాభరణం టైటిల్తో క్రైమ్ కామెడీని ప్లాన్ చేసిన కోన ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోయాడు. అంతేకాదు క్లాసిక్ టైటిల్ను సరైన సినిమాకు వినియోగించలేదన్న అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. అయినా కోన వెంకట్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు కూడా ఇదే ఫార్ములాను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే అపురూప చిత్ర రాజాల్లో ఒకటైన పాతాళభైరవి టైటిల్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోనవెంకట్. ప్రతి తెలుగు వాడికి సుపరిచితమైన ఈ టైటిల్తో సినిమా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. కోనకు ఆ ధైర్యం ఉంది. మరి ఆ పేరుకు న్యాయం చేసే అంత మంచి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియాలంటే మాత్రం మరికొద్ది వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement