ప్రయోగాలకే ఓటేస్తున్నాడు | another intresting film for nikhil | Sakshi
Sakshi News home page

ప్రయోగాలకే ఓటేస్తున్నాడు

Published Thu, Dec 3 2015 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

ప్రయోగాలకే ఓటేస్తున్నాడు

ప్రయోగాలకే ఓటేస్తున్నాడు

కమర్షియల్ జానర్లో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వటంతో ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న నిఖిల్, ఆ జానర్లో మంచి విజయాలు సాధిస్తున్నాడు. స్వామి రారా సినిమాతో తొలిసారిగా కమర్షియల్ ఫార్మాట్కు దూరంగా సినిమాలు చేయటం ప్రారంభించిన నిఖిల్, ఆ తరువాత వరుసగా కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. అంతేకాదు ఇక ముందు కూడా అదే తరహా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

ప్రస్తుతం కోన వెంకట్ నిర్మిస్తున్న శంకరాభరణం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యంగ్ హీరో. ఆ సినిమా సక్సెస్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్తో ఫాంలో ఉన్న నిఖిల్,  అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్లో సక్సెస్ అయిన ఫస్ గయా రే ఒబామా సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులతో రీమేక్ చేశారు.

ప్రస్తుతం టైగర్ సినిమా ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్న నిఖిల్ మరోసారి ప్రయోగానికే ఓటు వేస్తున్నాడు. కార్తీక్ రెడ్డి అనే కొత్త దర్శకున్ని పరిచయం చేస్తూ క్రీడా నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాకు ఓకే చెప్పాడు. 2016 ఫిబ్రవరిలో ఈ  సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement