మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్ | Nikhil next movie title keshava | Sakshi
Sakshi News home page

మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్

Published Thu, Oct 20 2016 10:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్

మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్

వరుస ఎక్స్ పరిమెంటల్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్. మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్. అదే సమయంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కేశవ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నిఖిల్ సరసన పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్ గానటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు నిఖిల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement