కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..! | Nikhil Sudheer Varma Keshava Movie story | Sakshi
Sakshi News home page

కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..!

Published Tue, Jan 3 2017 3:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..!

కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..!

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్. కెరీర్ స్టార్టింగ్లో రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తరువాత రూట్ మార్చి కొత్త కథలతో ఆకట్టుకుంటున్నాడు. స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్యతో పాటు లేటెస్ట్గా ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు.  ఈ యంగ్ హీరో చేస్తున్న తాజా చిత్రం కేశవపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే ఆ కిక్కే వేరు అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. కథ విషయానికి వస్తే నిఖిల్ రాజమండ్రిలో ఉండే ఓ కాలేజీ కుర్రాడు. అందరికి ఉన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో హీరో గుండె కుడిపక్కన ఉంటుంది.

దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. టెన్షన్ పడకూడదు. ఏ మాత్రం టెన్షన్ పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హీరో కొంతమంది మీద పగ తీర్చుకోవాలి. కోపం తెచ్చుకోకుండా హత్యలు చేయాలి. అది ఎలా సాధించాడన్నదే మిగతా కథ. మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్.. సక్సెస్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement