Keshava
-
పెన్షన్ ఆపేసి చంపేశారు
-
Pushpa: చిత్తూరు యాసలో ఇరగదీశాడు.. అసలు ఎవరీ కేశవ?
టాలీవుడ్లో మోస్ట్ అవైటడ్ మూవీగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’. సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవడంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లలో కొత్త రికార్డు సాధించడం చూసి సినీ పండితులు కూడా షాక్‌కు గురవుతున్నారు. కరోనా తరువాత ఈ రేంజ్లో బాక్సాఫీస్‌ని షేక్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో నటన పరంగా చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే బన్నీ పక్కన కేశవ పాత్రలో చేసిన జగదీష్ ప్రతాప్ బండారి గురించే. ఇంత వరకు చిన్న క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న జగదీష్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సఫలమయ్యాడనే చెప్పాలి. పుష్ప లాంటి భారీ బడ్జెట్ సినిమాలో హీరో పక్కన నటించే పాత్రల కోసం డైరెక్టర్ కొత్త నటులను తీసుకుని రిస్క్ తీసుకోరు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టిన అది సినిమాపై ప్రభావం చూపిస్తుంది. అందుకు అలాంటి పాత్రలకోసం దర్శకులు ఇండస్ట్రీలో పేరున్న నటులను ఎంపిక చేసుకుంటారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం పేరు కంటే ప్రతిభ ఉన్నవాళ్లకు తన సినిమాలలో అవకాశాలను ఇచ్చారు. కేశవ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి సినిమాలను చూస్తే.. అతను పలాస 1978, మల్లేశం సినిమాలలో నటించాడు. అది కూడా చిన్న పాత్ర మాత్రమే. అయినా అతను చేసిన ప్రాత పరిధిని కాకుండా తన నటన గుర్తించాడు సుకుమార్. సీమ యాసలో బాగా మాట్లాడే ఈ నటుడికి అదే యాసలో మాట్లాడే పాత్రను సుకుమార్ ఇవ్వడంతో పాత్ర న్యాయం చేశాడని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమాకు నెరేషన్ ఇచ్చింది కూడా ప్రతాప్ బండారి కావడం గమనార్హం. పుష్ప సక్సెస్ తో ప్రతాప్ బండారి పేరు ప్రస్తుతం టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఈ పేరుతో భవిష్యత్తులో మరిన్నీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. చదవండి: Samantha-Pushpa Movie: ఎట్టకేలకు పుష్ప స్పెషల్ సాంగ్ ట్రోల్స్‌పై స్పందించిన సామ్ -
హీరో నిఖిల్‌కు తప్పిన ప్రమాదం
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన యంగ్ హీరో నిఖిల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ జిమ్ ఓపెనింగ్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సందర్భంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది లిఫ్ట్ తలుపులను పగలగొట్టి అతన్ని బయటకు తీసుకువచ్చారు. నిఖిల్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కేశవ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ ప్రస్తుతం కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈసినిమా కోసం మేకోవర్ అవుతున్న ఈ యంగ్ హీరో ఫారిన్ టూర్ లతో పాటు పార్టీలు ఓపెనింగ్ కార్యక్రమాలతో బిజీగా టైం గడిపేస్తున్నారు. -
‘మంత్ర’ మాల్లో ‘కేశవ’
-
మేకింగ్ ఆఫ్ మూవీ - కేశవ
-
'కేశవ' మూవీ రివ్యూ
టైటిల్ : కేశవ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి సంగీతం : సన్నీ ఎమ్.ఆర్ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలతో సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్, మరో డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ, మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంతో నిఖిల్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయటపడి పూర్తి సీరియస్ క్యారెక్టర్ లో నిఖిల్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? కథ : కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తరువాత చిన్న క్లూ కూడా వదిలి పెట్టకుండా.. చనిపోయిన వారి శవాలను ఉరి వేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజ్ లో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ), అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? కారణం ఏంటి..? అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్టెమెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) కు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేను ఎలా సాల్వ్ చేసింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. లుక్ విషయంలో ఎప్పుడ లవర్ బాయ్ లానే కనిపిస్తూ వచ్చిన నిఖిల్.. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ తో బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రావూ రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణులు : నిఖిల్ తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. రోటీన్ రివేంజ్ కథను ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. సినిమాను రెండు గంటల లోపే ముగించిన సుధీర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్ లో నడిపించాడు. చాప్టర్ లుగా కథను నడిపించడం, అందుకు తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా కొంచెం కొంచెంగా రివీల్ చేయటం సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగేలా చేసింది. తొలి భాగాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్, సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో అయ్యాడు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడందుకోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నిఖిల్ నటన స్క్రీన్ ప్లే సినిమా నిడివి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నారేషన్ రొటీన్ స్టోరి కేశవ... ఇంటెన్స్ క్రైం థ్రిల్లర్. - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అది వాళ్లే చెప్పాలి
‘హ్యాపీడేస్’ విడుదలై పదేళ్లవుతున్నా, నాకేమో ఇప్పుడే చిత్రపరిశ్రమలోకి వచ్చినట్లుంది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను లక్కీ అనిపిస్తోంది’’ అని హీరో నిఖిల్ అన్నారు. నిఖిల్, రీతూవర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘కేశవ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్ పలు విశేషాలు చెప్పారు. ∙‘కేశవ’లో వైవిధ్యమైన పాత్ర ట్రై చేశా. నాలోని నటనను బయటపెట్టే అవకాశం ఈ కథలో ఉంది. 650 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఆస్ట్రేలియా లాంటి చోట్ల నా సినిమా విడుదలవడం ఇదే మొదటిసారి. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ∙‘బాహుబలి 2’ వంటి పెద్ద చిత్రం బాగా ఆడుతున్న సమయంలో నా సినిమా రిలీజ్ అవుతుండటం కాస్త టెన్షన్‌గా ఉంది. ‘బాహుబలి 2’ హవాలోనూ మా సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. అది మంచి ఓపెనింగ్స్ రావడానికి ఉపయోగపడుతుంది. ∙డైరెక్టర్స్‌కి నేను సలహాలివ్వను. వారు చెప్పింది చేస్తానంతే. నేనీ చిత్రంలో బాగా చేశానని సుధీర్‌వర్మ అంటున్నారు. నా వరకు వంద శాతం కష్టపడ్డా. ఎలా చేశాననేది ప్రేక్షకులు చెప్పాలి. ∙టాలీవుడ్లో కూడా మార్పొచ్చింది. వైవిధ్యమైన కథా చిత్రాలొస్తున్నాయి. నా తర్వాతి చిత్రాలు కూడా వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. రాజు సుందరం డైరెక్షన్లో కాలేజీ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నా. అలాగే చందు మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ 2’ చేస్తా. ఆ తర్వాత మాస్ స్టైల్లో యాక్షన్ సినిమా ఉంటుంది. -
తమిళ సినిమా రీమేక్‌లో నిఖిల్..?
వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తుంది. ఈ శుక్రవారం రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో కన్నడలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ రీమేక్‌లో నటించనున్నాడు. ఆ తరువాత కూడా రీమేక్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్. తమిళ్లో అధర్వ హీరోగా తెరకెక్కిన గణితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బిబిసిలో రిపోర్టర్‌గా వర్క్ చేయాలనుకున్న ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవటం, తరువాత ఆ కేసునుంచి ఆ యువకుడు ఎలా బయట పడ్డాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ చేసిన టి ఎన్ సంతోష్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘కేశవ’ చూడాలని ఉంది!
– దర్శకుడు గుణశేఖర్ ‘‘సన్ని సంగీతం బాగుంటుంది. తను ఎంత మంచి సంగీత దర్శకుడో ఎం.ఎం. కీరవాణిగారు చెప్పారు. ట్రైలర్ చూస్తుంటే ‘కేశవ’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కుతూహలంగా ఉంది. అభిషేక్ నామా మంచి పంపిణీదారుడే కాదు. గొప్ప ప్రేక్షకుడు కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా నిలిచిపోతాడు’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. నిఖిల్, రీతూవర్మ, ఇషా కొప్పీకర్ ముఖ్య పాత్రల్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో దేవాన్ష నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించిన చిత్రం ‘కేశవ’. సన్ని ఎం.ఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమా చేస్తున్నప్పుడు మనకు సపోర్ట్ చాలా అవసరం. ఆ సపోర్ట్ నాకు ప్రేక్షకులతో పాటు చందు, సుధీర్, చైతు అందించారు. అభిషేక్‌గారు నాకు పెద్దన్నలాంటివారు. ఆయన వంద సినిమాలు నిర్మించి, ఎంతో ఎత్తుకు చేరుకోవాలి’’ అన్నారు. ‘‘సుధీర్‌వర్మ నా ఫేవరెట్ దర్శకుల్లో ఒకరు. ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు హీరో శర్వానంద్. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘స్టోరీ వినగానే నిఖిల్, అభిషేక్‌గారు ‘కేశవ’ చేయడానికి అంగీకరించారు. మన కాంబినేషన్లో మరో చిత్రం ఎప్పుడు చేద్దాం? అని అభిషేక్‌గారు అంటున్నారు’’ అని సుధీర్ వర్మ చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్, దర్శకులు నందినీ రెడ్డి, చందూ మొండేటి, నటులు అడివి శేషు, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. -
'మర్డర్ చేసినా ప్రశాంతంగానే చేయాలి'
కుడివైపు గుండెతో..కేశవ హైదరాబాద్ : గొప్పగా కొత్తగా చెప్పడానికి నాది కథ కాదు..బాధ. నాకో ప్రాబ్లమ్ ఉంది. అందరికి ఎడమవైపుండాల్సిన గుండె, నాకు కుడి వైపుంది. దాని వల్ల ఎక్కువ కంగారుపడినా, భయపడినా హర్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్‌గా చెప్పాలంటే హర్రర్ మూవీ చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను..ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్‌తో సహా... అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ 'కేశవ'తో యంగ్ హీరో నిఖిల్ మన ముందుకొస్తున్నాడు. 'కేశవ' థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. తన ట్విట్టర్లో నిఖిల్ ట్రైలర్‌ను పోస్ట్ చేసిన తక్కువ వ్యవధిలోనే అభిమానులు తెగ రీట్వీట్లు చేస్తున్నారు. థ్రిల్లింగ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్వామి రారా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నిఖిల్ లుక్, ప్రమోషన్ సూపర్బ్‌గా ఉండటంతో కేశవపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ట్రైలర్ నచ్చితే షేర్ చేయండంటూ నిఖిల్ ట్రైలర్‌తో పాటూ ఓ కామెంట్ పెట్టాడు. దీనికి రీప్లేగా.. నచ్చడం కాదు అదిరిపొయింది!!!! అంటూ రానా, అల్లరి నరేష్‌లు పొగడ్తలతో ముంచెత్తారు. Here is the KESHAVA THEATRICAL TRAILER -
'మర్డర్ చేసినా ప్రశాంతంగానే చేయాలి'
-
‘కేశవ’ వర్కింగ్ స్టిల్స్
-
సోలోగా వస్తోన్న కేశవ..?
డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్, త్వరలో కేశవగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లింగ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా స్వామి రారా కాంబినేషన్ రిపీట్ అవుతుండటం.. నిఖిల్ లుక్, ప్రమోషన్ సూపర్బ్‌గా ఉండటంతో కేశవపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా కేశవకే ఫేవర్ చేసేలా ఉంది. మే 19న కేశవ రిలీజ్ అవుతోంది. అయితే ముందుగా అదే రోజు నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం, గోపిచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నాగచైతన్య సినిమా వారం వెనక్కి పోవటం నిఖిల్‌కు ప్లస్ అయ్యింది. అంతేకాదు ఆరడుగుల బుల్లెట్‌ను కూడా రెండు మూడు వారాలు వాయిదా వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నిఖిల్ కేశవకు పోటి లేకుండా పోతుంది. సోలోగా వారం పాటు థియేటర్లలో సత్తా చూపించే చాన్స్ ఉంటుంది. -
నిఖిల్ డైరెక్టర్‌తో శర్వా
స్టార్ హీరోలతో ఢీ అంటే ఢీ అని సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్. వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో టాప్ స్టార్లతో పోటి పడి సక్సెస్ సాధించిన శర్వానంద్, ఈ శుక్రవారం రాధగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న పోలీస్ కథతో అలరించనున్నాడు శర్వా. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో సినిమాను ఫైనల్ చేశాడు ఈ యంగ్ హీరో. స్వామి రారా సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ ప్రస్తుతం మరోసారి నిఖిల్ హీరోగా కేశవ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మే మూడో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కేశవ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేశవ తరువాత సుధీర్ వర్మ, శర్వానంద్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శర్వానంద్‌కు లైన్ వినిపించిన దర్శకుడు ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. -
నిఖిల్ మరో ప్రయోగం
ప్రయోగాత్మక చిత్రాలతో మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకునే నిఖిల్ తన తదుపరి చిత్రంలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. కేశవ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఓ వింత వ్యాధితో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడు. కథ కథానాల విషయంలోనే కాదు, ఈ సినిమా మేకింగ్, టెక్నికల్ అంశాల విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు నిఖిల్. సాధారణంగా తెలుగు సినిమాలు రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి రెండున్నర గంటల లెంగ్త్ ఉంటాయి. కానీ నిఖిల్ ఈ సాంప్రదాయానికి స్వస్తి చెపుతూ సినిమా రన్ టైం ను గంట 45 నిమిషాలుగా ఫిక్స్ చేశాడు. ఈ మధ్య కాలంలో వస్తున్న అతి తక్కువ రన్ టైం ఉన్న సినిమా ఇదే. అంతేకాదు ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందని తెలుస్తోంది. వేసవిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా నిఖిల్ న్యూ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. -
పగ... ప్రతీకారం
నిఖిల్, రీతూ వర్మ జంటగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. హిందీ భామ ఇషా కొప్పికర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ జరిపిన చిత్రీకరణతో 90 శాతం సినిమా పూరై్తంది. హైదరాబాద్‌లో జరగనున్న చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణంతా పూర్తవుతుంది. నిఖిల్–సుధీర్‌వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’ తరహాలో ‘కేశవ’ కూడా ట్రెండ్ సెట్టింగ్ సబ్జెక్ట్. మే 12న చిత్రాన్ని విడుదల చేయాలనేది మా ప్లాన్’’ అన్నారు. ‘‘పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దివాకర్ మణి, సంగీతం: యం.ఆర్. సన్నీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
కేశవ కేక
తెలుగు చిత్రసీమలో ఎంత స్నేహపూర్వక, ఆరోగ్యకర వాతావరణం ఉందనేది చెప్పడానికి ఈ సంఘటన ఓ చిన్న ఉదాహరణ. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ‘కేశవ’ నైజాం హక్కులను మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘ఏషియన్’ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. ‘‘సునీల్ నారంగ్, నేనూ కలసి ‘అత్తారింటికి దారేది’, ‘మనం’ వంటి హిట్ చిత్రాలను పంపిణీ చేశాం. నాకు మంచి ఫ్రెండ్. ‘కేశవ’ గురించి ఆయనకు తెలుసు. అందువల్ల, ఫ్యాన్సీ రేటుకి నైజాం హక్కులు తీసుకున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నాం. ఈ ‘కేశవ’ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా కేక అని చూసినవాళ్లు అంటారు’’ అన్నారు అభిషేక్. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
కోప్పడకుండానే హత్యలు చేస్తాడట..!
టాలీవుడ్ యంగ్ జనరేషన్లో డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్. కెరీర్ స్టార్టింగ్‌లో రొటీన్ సినిమాలతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తరువాత రూట్ మార్చి కొత్త కథలతో ఆకట్టుకుంటున్నాడు. స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్యతో పాటు లేటెస్ట్గా ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ యంగ్ హీరో చేస్తున్న తాజా చిత్రం కేశవపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలు అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్. పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే ఆ కిక్కే వేరు అనే ట్యాగ్ లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. కథ విషయానికి వస్తే నిఖిల్ రాజమండ్రిలో ఉండే ఓ కాలేజీ కుర్రాడు. అందరికి ఉన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో హీరో గుండె కుడిపక్కన ఉంటుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. టెన్షన్ పడకూడదు. ఏ మాత్రం టెన్షన్ పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న హీరో కొంతమంది మీద పగ తీర్చుకోవాలి. కోపం తెచ్చుకోకుండా హత్యలు చేయాలి. అది ఎలా సాధించాడన్నదే మిగతా కథ. మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్.. సక్సెస్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. -
క్రైం థ్రిల్లర్‌గా నిఖిల్ 'కేశవ'
పెద్ద నోట్ల రద్దు తరువాత రిలీజ్ అయి ఘన విజయం సాధించిన తొలి సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా 50 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఎక్కడికీ పోతావు చిన్నవాడా సూపర్ హిట్ కావటంతో నిఖిల్ చేయబోయే నెక్ట్స్ సినిమా పై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇటీవల ప్రీ లుక్ పోస్టర్‌తో ఇదో క్రైం థ్రిల్లర్ అన్న హింట్ ఇచ్చిన నిఖిల్, ఫస్ట్ లుక్‌తో సినిమా జానర్ ఏంటో కన్ఫామ్ చేసేశాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. -
మాస్ ఇమేజ్ ప్రయత్నాల్లో నిఖిల్
వరుస ఎక్స్ పరిమెంటల్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్. మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న నిఖిల్. అదే సమయంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన స్వామిరారా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కేశవ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నిఖిల్ సరసన పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ హీరోయిన్ గానటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఇషా కొప్పికర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. రీవేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు నిఖిల్. -
కుర్రాడు చాలా హుషారు
నిఖిల్, రీతూ వర్మ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రానికి ‘కేశవ’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘తీర ప్రాంత నేపథ్యంలో నడిచే రివెంజ్ డ్రామా ఇది. హుషారైన యువకుడిగా నిఖిల్ నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ పోలీసాఫీసర్‌గా కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది’’ అన్నారు. రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. -
గ్రేటర్లో దూకుడుగా 'టీఆర్ఎస్'