హీరో నిఖిల్కు తప్పిన ప్రమాదం
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన యంగ్ హీరో నిఖిల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ జిమ్ ఓపెనింగ్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సందర్భంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది లిఫ్ట్ తలుపులను పగలగొట్టి అతన్ని బయటకు తీసుకువచ్చారు. నిఖిల్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల కేశవ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ ప్రస్తుతం కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈసినిమా కోసం మేకోవర్ అవుతున్న ఈ యంగ్ హీరో ఫారిన్ టూర్ లతో పాటు పార్టీలు ఓపెనింగ్ కార్యక్రమాలతో బిజీగా టైం గడిపేస్తున్నారు.