hero nikhil
-
నన్ను ఎప్పుడు హీరో లాగా చూడదు తను : హీరో నిఖిల్
-
నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే స్టైల్ కొట్టింది
-
హీరో నిఖిల్ పై ఆయన భార్య ఫన్నీ కామెంట్స్
-
నిఖిల్ మరియు పల్లవి ఒకరికొకరు ఎంత బాగా తెలుసు అంటే..?
-
భార్య మీద కామెడీ చేసిన హీరో నిఖిల్..!
-
నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎందుకంటే : పల్లవి వర్మ
-
అనుపమతో స్టెప్పులేసిన అల్లు అరవింద్.. వీడియో వైరల్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ మరో సూపర్‌హిట్ మూవీని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదివరకే కార్తికేయతో సక్సెస్ అందుకున్న ఈ జోడీ తాజాగా 18 పేజెస్తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా అనుపమ, నిఖిల్ల నటన, డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా, ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న విడుదలైన 18 పేజెస్ సినిమా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌ను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ మూవీలోని 'టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు' అంటూ సాగే పాటకు అనుపమతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. అనుపమ, అల్లు అరవింద్‌తో పాటుగా, సుకుమార్ కూడా స్టెప్పులు వేశారు. ఈ వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
ఆమె రాసిన లెటర్ చదవగానే కన్నీళ్లు వచ్చాయి: నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్‌తో కలిసి నిఖిల్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో హోస్ట్ నిఖిల్‌కు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని రివీల్ చేశాడు. నిఖిల్‌కు ఓ అమ్మాయి రాసిన లెటర్ గురించి హొస్ట్ ఆరా తీశారు. చదవండి: డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్ దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ‘అవును అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న. అదే సమయంలో ఓ అమ్మాయి నాకు లెటర్ రాసింది. ఆ ఉత్తరం చదివి భావోద్వేగానికి గురయ్యా. ఆ లేఖ చదవడం పూర్తయ్యేసరికి కళ్లనుంచి నీళ్లోచ్చాయి. తన అభిమానానికి చూసి ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే నేనొక నార్మల్ హీరోని. చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను అభిమానిస్తూ పెరిగిన నేను ఈ స్థాయికి వచ్చాను. అటువంటి నాకు ఒక ఫ్యాన్ అభిమానిస్తూ లేఖ రాయడం ఆశ్చర్యంగా అనిపించింది. అది చదివేసరిగా నాకు కన్నీళ్లు ఆగలేదు’ అంటూ నిఖిల్ వివరణ ఇచ్చాడు. ఇక చివరగా కార్తికేయ 2లో తనకు నచ్చిన సీన్ క్లైమాక్స్ అని చెప్పాడు. శ్రీ కృష్ణుడు గురించి చెప్పే ఈ సీన్లో నాకు తెలియకుండానే లీనమైపోయా.. ఆ ప్రభావం తనపై పడటంతో తెలియకుండానే ఏడ్చేశానన్నాడు. సహాజంగా వచ్చిన ఈ సీన్ క్లైమాక్స్‌కు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పాడు. -
ఇది నాకు ఎంతో ప్రత్యేకం: అనుపమ పరమేశ్వరన్
సీతమ్మధార (విశాఖ ఉత్తర): శ్రీ కృష్ణుని ద్వారక ఇతివృత్తంగా కార్తికేయ–2 చిత్రం రూపొందించినట్లు హీరో నిఖిల్ తెలిపారు. సాంకేతికపరంగా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్, ప్రేమ, యాక్షన్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. కార్తికేయ–2 చిత్రం ట్రైలర్‌ను శరత్ థియేటర్లో మంగళవారం చిత్రయూనిట్ సభ్యులు విడుదల చేశారు. ప్రేక్షకుల ముందు ట్రైలర్ విడుదల చేసి, కాసేపు ముచ్చటించారు. చదవండి: సుష్మితా సేన్ లైవ్ వీడియోలో మాజీ బాయ్‌ఫ్రెండ్.. లలిత్ ఎక్కడ? అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి కథనంపై రూపొందించిన కార్తికేయ–1 చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరించారన్నారు. ద్వారకలోని శ్రీ కృష్ణుడి గుడి చుట్టూ జరిగే కథాంశం ఆధారంగా కార్తికేయ–2 చిత్రాన్ని రూపొందించామన్నారు. తమ సినిమాను శ్రీకృష్ణుడే ముందుకు నడిపారని, షూటింగ్ సమయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పారు. దర్శకుడు చందూ మొండేటి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఈ నెల 13న చిత్రాన్ని పాన్ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ–2, చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రేక్షకులు చూసినంత సేపు తర్వాత ఏమి జరుగుతుందో అని ఉద్వేగానికి గురవుతారన్నారు. చిత్రనటులు శ్రీనివాసరెడ్డి, హర్ష మాట్లాడుతూ ఇంత గొప్ప చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న కార్తికేయ-2 ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అనుపమ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా. ఇప్పటికే కార్తికేయ-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం'అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
మంచులో కప్పేసిన డబ్బాలో నుంచి తుపాకీలు తీసిన నిఖిల్
‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం స్పై. ఈ స్పై థ్రిల్లర్ మూవీలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ కథానాయిక. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజయ్యాయి. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు. ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. చదవండి: మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్ కరణ్ జోహార్ బర్త్ డే: బాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా -
హీరో నిఖిల్ ఆవేదన.. ఈ పరిస్థితుల నుంచి బయటపడేయాలని ట్వీట్
Actor Nikhil Feels Disappointed Over His Upcoming Movies Release Dates Postpone: కరోనా మహమ్మారి దాదాపు అన్ని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సినిమా ఇండస్ట్రీపై కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఇప్పటికే పలు సినిమాలు కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మహమ్మారి కెరీర్‌ను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం చాలా బాధాకరం. 'అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 సినిమాలకు సైన్చేశాను. వాటి రిజల్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ రిలీజ్ డేట్స్ అన్నీ మన చేతుల్లో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల నుంచి తర్వగా భయపడి, సినిమాలన్నీ అనుకున్న సమయానికి విడుదల చేసేలా ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం నిఖిల్ షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Very sad to c this Pandemic affect careers on this level.. After the succes of #ArjunSuravaram I signed 4 movies... 4 brilliant scripts that I am very confident about. But Release dates have all gone Haywire. Praying to God this all sorts out & we release the movies Perfectly — Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2022 -
సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు!
‘‘కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివిర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో బెడ్లు.. ఇలా నెల రోజుల నుంచి నా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో రిక్వెస్ట్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో వాలంటీర్లు, నా ఫ్రెండ్స్, నా అభిమానులు నాకు సాయంగా ఉంటున్నారు’’ అని నిఖిల్ అన్నారు. నిఖిల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం షూటింగ్‌లు ఆగిపోయాయి.. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం? అందుకే సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎవరి వద్దా డబ్బు సహాయంగా తీసుకోవడం లేదు. నా సొంత డబ్బులతోనే సాయం అందిస్తున్నాను. చాలా మంది డబ్బులు పంపుతామని సంప్రదించారు. అయితే ఆ డబ్బుతో మీ ప్రాంతాల్లో అవసరమైన వారికి సాయపడండి అని చెబుతున్నాను’’ అన్నారు. వైవాహిక జీవితం గురించి నిఖిల్ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది మే 14న కోవిడ్ సమయంలోనే పల్లవితో నా పెళ్లి అయింది. హనీమూన్‌కి విదేశాలకు వెళ్లే పరిస్థితి అప్పుడు లేకపోవడంతో సిమ్లా, గోవాలకు వెళ్లాం. పల్లవి డాక్టర్ కావడంతో రోగులకు అవసరమైన మందులను ఫోనులో చెబుతుంటుంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తను కూడా ఓ వాలంటీర్’’ అన్నారు. చేస్తున్న సినిమాల గురించి చెబుతూ – ‘‘ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’ చిత్రాలు చేస్తున్నాను. మరో మూడు సినిమాలకు సంతకం చేశాను’’ అన్నారు. -
కొన్ని ప్రాణాలు కాపాడగలిగామన్న సంతృప్తి ఉంది: నిఖిల్.
‘‘బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం రిక్వెస్ట్ వస్తే మణికొండ నుంచి నా భార్యతో రాజేంద్రనగర్‌లోని ఫార్మా ఫ్యాక్టరీ గోడౌన్ వరకూ వెళ్లి, అక్కడ్నుంచి సోమాజిగూడ ఆసుపత్రి దాకావెళ్లి ఆ మెడిసిన్ అందజేశాను. రాత్రి 2 గంటల టైమ్‌లో నేనొస్తానని ఊహించలేదేమో.. ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు హీరో నిఖిల్. నాలుగు రోజుల క్రితం నిఖిల్ అవసరార్ధుల కోసం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రికి మెడిసిన్స్ తీసుకెళుతున్న సమయంలో పోలీసులు ‘ఈ పాస్’ లేదని అడ్డుకున్నారు. ‘‘ఆ రోజు ఏం జరిగిందంటే... మందులు తీసుకెళుతున్నప్పుడు పోలీసులు ఆపారు. మాస్క్ తీసి ముఖం చూపలేదు కానీ, ప్రిస్క్రిప్షన్ చూపించి, ఎమర్జెన్సీ అని చెప్పినా ‘ఈ పాస్’ ఉండాల్సిందే అన్నారు. రోడ్డు మీదే 20నిమిషాలు ట్రై చేసినా పాస్ దొరకలేదు. ఆ విషయాన్నే ట్వీట్ చేశా’’ అన్నారు నిఖిల్. ఈ ఉదంతం బయటకు వచ్చేవరకూ నిఖిల్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’తో నిఖిల్ పంచుకున్న అనుభవాలివి.. తుపాన్లు, వరదలు వస్తే నష్టాన్ని అంచనా వేసి తలా ఇంత అని సాయం చేయడం వేరు. కానీ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, మందులు దొరక్క ప్రాణాలు పోయే పరిస్థితులు.. అంచనాలకు అందని వ్యాధులు.. వీటి మధ్య అవసరార్ధులకే కాదు సాయం చేయాలనుకున్నవారికీ కష్టమే. గత ఏప్రిల్‌లో నా భార్య, మా అంకుల్ కోవిడ్ బారిన పడినప్పుడు ఆసుపత్రుల్లో బెడ్స్ కోసం ఎదుర్కొన్న ఇబ్బందులు నన్ను ఆలోచింపజేశాయి. అప్పటికే ట్విట్టర్లో చూస్తే... పెద్ద సంఖ్యలో సాయం కోరుతూ రిక్వెస్టులు. కొంతమందికైనా సహాయం చేయాలనుకున్నాను. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్‌లలో వచ్చిన ప్రతీ రిక్వెస్ట్‌నీ పరిశీలించి, వీలైనంతవరకూ అటెండయ్యాం. ఇంజక్షన్ కావాలన్నవారికి ఇంజక్షన్, మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఆసుపత్రి బిల్ కట్టలేకపోయిన వారికి బిల్లు... ఇలా వందలాది పేషెంట్స్‌కి కావాల్సినవి సమకూర్చగలిగాం. కాకినాడ కేజీహెచ్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్, విజయవాడ కామినేని ఆసుపత్రిలో ఇలా కొందరి గురించి ఆరోగ్యాంధ్రకు వారిని ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. వారు కూడా ఆయా పేషెంట్స్‌కి ఉచితంగా చికిత్స చేయించారు. నాకు విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ ఆసుపత్రుల్లో మంచి పరిచయాలు ఉండడం హెల్ప్ అయింది. రిక్వెస్టులు తగ్గాయి ఈ నెల 15 వరకూ రోజుకు దాదాపు 1000 దాకా రిక్వెస్టులు వచ్చాయి. అయితే ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టడం వల్ల, బెడ్స్ బాగా పెరిగి అందుబాటులోకి రావడం వల్లనేమో ఆ తర్వాత తగ్గాయి. గతంలో తిత్లీ తుపాన్ టైమ్‌లో కూడా బాధితులకు సేవ చేసిన అనుభవం ఉంది. అయితే ఇన్ని రోజులు ఇంత కంటిన్యూగా చేయడం చాలా కొత్త అనుభవాలను, పాఠాలను నేర్పింది. ఒక అబ్బాయికి ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల ప్రాణాలు కాపాడలేకపోవడమనే బాధ కలచివేసింది. ఏదేమైనా కొన్ని ప్రాణాలైనా కాపాడగలిగాం, కొంతమందికైనా ఉపశమనం ఇచ్చామనే సంతృప్తి అయితే ఉంది. పుట్టినరోజుకి ఫస్ట్ లుక్ నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘18 పేజెస్’ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అయితే బుధవారం అప్డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘18 పేజెస్’ టైటిల్ ఫిక్స్ చేసినప్పటినుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: వసంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శరణ్ రాపర్తి, అశోక్ బి. -
షూటింగ్లో గాయపడ్డ హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ గుజరాత్లో కొనసాగుతోంది. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్న నిఖిల్ కాలికి గాయాలైనట్లు సమాచారం. డూప్ లేకుండా యాక్షన్ స్టంట్స్ చేసే క్రమంలో అతడు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం లేదని చిత్రబృందం తెలిపింది. రానున్న మూడు రోజులూ నిఖిల్‌కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ లేదు. ఈ మూడు రోజులూ విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత నిఖిల్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడు. ఇదిలా వుంటే.. అప్పట్లో సూపర్ హిట్ థ్రిల్లర్‌గా టాక్ తెచ్చుకున్న 'కార్తికేయ'కు సీక్వెల్‌గా వస్తోంది 'కార్తికేయ 2'. ఈ చిత్రం ద్వారా హీరో నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి మరోసారి కలిసి పని చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో '18 పేజీస్' అనే మరో చిత్రం చేస్తున్నాడు. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చదవండి: అప్పుడు వ్యవసాయం చేస్తాను: శర్వానంద్ ఆ క్రెడిట్.. డబ్బులు కోమలికే! -
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
పార్టీలో మేం ఉన్నందుకు హ్యాపీ
‘‘కిరాక్ పార్టీ’ చిత్రంలో నా పాత్ర పేరు మీరా. ఎంతమంది అబ్బాయిలు వెంట పడ్డా పట్టించుకోని పాత్ర. కన్నడలో ఈ పాత్రను రష్మికా చేశారు. నేను ఆమెను ఫాలో కాకుండా దర్శకుడు చెప్పినట్టు కొత్తగా చేశా. నిఖిల్ నన్నెప్పుడూ కొత్త హీరోయిన్ని చూసినట్టు చూడలేదు. చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. టైటిల్‌కి తగ్గట్టుగానే మంచి పార్టీలా ఉంటుంది’’ అని కథానాయిక సిమ్రన్ అన్నారు. నిఖిల్, సిమ్రన్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్ పార్టీ’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త హెగ్డే మాట్లాడుతూ– ‘‘కన్నడ ‘కిరిక్ పార్టీ’లో నేను నటించా. నా పాత్ర నచ్చి దర్శక–నిర్మాతలు ‘కిరాక్ పార్టీ’కి తీసుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా విషయంలో నాకు నేనే పోటీ. నా పాత్ర పేరు సత్య. ఫన్ లవింగ్ బబ్లీ గర్ల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్ర ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అందులోని ట్విస్ట్ ఏంటన్నది సినిమాలో చూడాలి. తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నా. తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇంకా ఏదీ అంగీకరించలేదు. ‘కిరాక్ పార్టీ’ విడుదలయ్యాక చూడాలి’’ అన్నారు. -
హీరో నిఖిల్‌కు తప్పిన ప్రమాదం
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన యంగ్ హీరో నిఖిల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ జిమ్ ఓపెనింగ్ లో పాల్గొని తిరిగి వెళ్తున్న సందర్భంలో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది లిఫ్ట్ తలుపులను పగలగొట్టి అతన్ని బయటకు తీసుకువచ్చారు. నిఖిల్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కేశవ సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ ప్రస్తుతం కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈసినిమా కోసం మేకోవర్ అవుతున్న ఈ యంగ్ హీరో ఫారిన్ టూర్ లతో పాటు పార్టీలు ఓపెనింగ్ కార్యక్రమాలతో బిజీగా టైం గడిపేస్తున్నారు. -
ఇన్అఆర్బిట్ మాల్లో హిరో నిఖిల్ సందడి
-
నంద్యాలలో సినీ హీరో నిఖిల్
నంద్యాల రూరల్: అయ్యలూరు మెట్టవద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల దశాబ్ది ఉత్సవాలకు హీరో నిఖిల్, హీరోయిన్ మన్నార్ చోప్రా అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కాలేజీయాజమాన్యం నిఖిల్, మున్నార్ చోప్రా చేతుల మీదుగా బహుమతులు అందించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టకున్నాయి. చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఎండీ దినేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లికార్జున రెడ్డి, డాక్టర్ ఎస్.నారపురెడ్డి, స్వరూపా రాణి తదితరులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా అవసరం : హీరో నిఖిల్
కుప్పం: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చాలా అవసరమని సినీ హీరో నిఖిల్ అన్నారు. శనివారం ఐఆర్ఎమ్ విద్యాసంస్థలు ఆధ్వర్యంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగి వుంటే బాగుండేదన్నారు. ప్రస్తుతం కేశవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో నాగార్జున లాంటి పెద్ద హీరోలతో నటించే అవకాశం వస్తుందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. -
‘పెద్ద’ ఇబ్బందుల్లో ఉన్నా సినిమాను ఆదరించారు
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ హీరో నిఖిల్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్లు రద్దై, డబ్బు మార్పిడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తన సినిమాను మాత్రం హిట్ చేశారని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా హీరో నిఖిల్ అన్నారు. మేఘనా ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ్సపై నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విజయం సా««ధించిన సందర్భంగా ఆ సినిమా యూనిట్ ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఊర్వశి థియేటర్‌కు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కావడంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేక ఆగిపోయాయని, ఇటువంటి సమయంలో కూడా తన చిత్రాన్ని ఆదరించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రేక్షకులను మరువలేనని అన్నారు. అనంతరం సినిమాలో తన నటన, హాస్యం ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు వై.ఆనంద్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో నాణ్యతపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సినిమా విజయం సాధించడం ఖాయమని ఊహించినా, ప్రస్తుత సంక్షోభంలో ఎలా ఉంటుందోనని తొలుత భయమేసిందన్నారు. యూనిట్‌ను చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. విజయయాత్రలో హీరోయిన్లలో ఒకరైన నందితా శ్వేత, నిర్మాత పీవీ రావు, సురేష్ మూవీస్ మేనేజర్ సత్తి రంగయ్య, ఎగ్జిబిటర్ రౌతు వెంకటేశ్వరావు, గెడ్డం శ్రీను ఉన్నారు. -
హిరో నిఖిల్ సందడి
గన్నవరం : ప్రముఖ సినీహిరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ గన్నవరంలో సందడి చేశారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో సమీపంలోని తోటలో ఆదివారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన వనసమారాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిఖిల్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా హ్యాపీడేస్ రిలీజ్ అయ్యే వరకు తన గురించి ఎవరికి తెలియదని, మీరందరూ చూపిస్తున్న అభిమానంతో ఇప్పటి వరకు విజయవంతంగా 13 సినిమాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం రిలీజైన ఎక్కడిపోతావు చిన్నావాడా సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందన్నారు. యువత తల్లిదండ్రులు చెప్పినట్లు చదువులో రాణిస్తూ మంచి ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు. తర్వాత తమ ఆసక్తికి అనుగుణంగా ఎంచుకున్న రంగాల్లో ప్రతిభను నిరూపించుకోవాలని చెప్పారు. తాను కూడా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే ఇష్టమైన సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. తొలుత ఆయనకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెరుసు సతీష్, బొడ్డు రమేష్, నాయకులు నాగనబోయిన గిరిష్రాజు, దారం దుర్గావరప్రసాద్, కొలుసు పాములు స్వాగతం పలికారు. -
బొటిక్ ప్రారంభించిన సీనీ తారలు
-
నిఖిల్ సరసన నందిత
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ తాజా చిత్రంలో తమిళ నటి నందితా శ్వేత కధానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది. కొన్ని నెలల పాటు కొత్త హీరోయిన్ కోసం అన్వేషించిన చిత్ర యూనిట్ ఫైనల్‌గా నందితా శ్వేతను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నిఖిల్ సరసన ఈ సినిమాలో అవికా గోర్, హెబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా నందిత కూడా అలరించనుంది. తెలుగులో అవకాశాలు తలుపు తట్టినప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటివరకు ఏ సినిమా అంగీకరించలేదని నందిత చెబుతోంది. ప్రస్తుతం ఓ హర్రర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె.. అది పూర్తవగానే నిఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. యూత్‌ను ఆకట్టుకునే ప్రేమకధగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రెండు వేరు వేరు పాత్రల్లో కనిపించనున్నాడు. ఆనంద్ వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర స్వరాలందిస్తున్నాడు.