- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ హీరో నిఖిల్
‘పెద్ద’ ఇబ్బందుల్లో ఉన్నా సినిమాను ఆదరించారు
Published Thu, Dec 1 2016 11:09 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
పెద్ద నోట్లు రద్దై, డబ్బు మార్పిడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తన సినిమాను మాత్రం హిట్ చేశారని ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా హీరో నిఖిల్ అన్నారు. మేఘనా ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ్సపై నిర్మించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ విజయం సా««ధించిన సందర్భంగా ఆ సినిమా యూనిట్ ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న ఊర్వశి థియేటర్‌కు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు కావడంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేక ఆగిపోయాయని, ఇటువంటి సమయంలో కూడా తన చిత్రాన్ని ఆదరించిన ఉభయ గోదావరి జిల్లాల ప్రేక్షకులను మరువలేనని అన్నారు. అనంతరం సినిమాలో తన నటన, హాస్యం ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సినిమా దర్శకుడు వై.ఆనంద్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాణంలో నాణ్యతపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సినిమా విజయం సాధించడం ఖాయమని ఊహించినా, ప్రస్తుత సంక్షోభంలో ఎలా ఉంటుందోనని తొలుత భయమేసిందన్నారు. యూనిట్‌ను చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. విజయయాత్రలో హీరోయిన్లలో ఒకరైన నందితా శ్వేత, నిర్మాత పీవీ రావు, సురేష్ మూవీస్ మేనేజర్ సత్తి రంగయ్య, ఎగ్జిబిటర్ రౌతు వెంకటేశ్వరావు, గెడ్డం శ్రీను ఉన్నారు.
Advertisement
Advertisement