ఉద్వేగానికి గురి చేసే ప్రేమకథ! | Drsyakavyam 'hero Nikhil trailer released | Sakshi
Sakshi News home page

ఉద్వేగానికి గురి చేసే ప్రేమకథ!

Published Sun, Feb 28 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

ఉద్వేగానికి గురి చేసే ప్రేమకథ!

ఉద్వేగానికి గురి చేసే ప్రేమకథ!

‘‘ఈ చిత్ర దర్శక, నిర్మాతలకు సినిమా అంటే ప్యాషన్. ‘దృశ్యకావ్యం’ ట్రైలర్ చాలా బాగుంది. చూసేందుకు కొత్తగా అనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తే, మరిన్ని కొత్త, చిన్న చిత్రాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది’’ అని హీరో నిఖిల్ అన్నారు.
 
  రామ్ కార్తీక్, కాశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి తెరకెక్కించిన ‘దృశ్యకావ్యం’ ట్రైలర్‌ను నిఖిల్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఎమోషనల్ లవ్‌స్టోరీతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. అందరికీ నచ్చేలా ప్రతి సీన్‌ను జాగ్రత్తగా తీశా.
 
 కమలాకర్ మంచి పాటలు ఇచ్చాడు. మార్చి 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘‘ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ‘దృశ్యకావ్యం’ వినడానికి ఎంత బావుంటుందో చూసేందుకు అంతకన్నా బాగా ఉంటుంది’’ అని రామ్ కార్తీక్ అన్నారు. కాశ్మీరా కులకర్ణి, సంగీత దర్శకుడు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లు శివనాగేంద్రరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement