హిరో నిఖిల్‌ సందడి | Hero nikhil @ gannavaram | Sakshi
Sakshi News home page

హిరో నిఖిల్‌ సందడి

Published Sun, Nov 27 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

హిరో నిఖిల్‌ సందడి

హిరో నిఖిల్‌ సందడి

గన్నవరం : ప్రముఖ సినీహిరో నిఖిల్‌ సిద్ధార్థ యాదవ్‌ గన్నవరంలో సందడి చేశారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో సమీపంలోని తోటలో ఆదివారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన వనసమారాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిఖిల్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం చూపారు. అనంతరం నిఖిల్‌ మాట్లాడుతూ.. తన మొదటి సినిమా హ్యాపీడేస్‌ రిలీజ్‌ అయ్యే వరకు తన గురించి ఎవరికి తెలియదని, మీరందరూ చూపిస్తున్న అభిమానంతో ఇప్పటి వరకు విజయవంతంగా 13 సినిమాల్లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం రిలీజైన ఎక్కడిపోతావు చిన్నావాడా సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిందన్నారు. యువత తల్లిదండ్రులు చెప్పినట్లు చదువులో రాణిస్తూ మంచి ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు. తర్వాత తమ ఆసక్తికి అనుగుణంగా ఎంచుకున్న రంగాల్లో ప్రతిభను నిరూపించుకోవాలని చెప్పారు. తాను కూడా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే ఇష్టమైన సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు వివరించారు. తొలుత ఆయనకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నెరుసు సతీష్, బొడ్డు రమేష్, నాయకులు నాగనబోయిన గిరిష్‌రాజు, దారం దుర్గావరప్రసాద్, కొలుసు పాములు  స్వాగతం పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement