![Hero Nikhil Interesting Comments About A letter From Lady Fan in Latest Interview - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/10/MOVIE.jpg.webp?itok=4sIR0Hvv)
యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయకు సీక్వెల్ ఈ సినిమా వస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్‌తో కలిసి నిఖిల్ ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో హోస్ట్ నిఖిల్‌కు సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని రివీల్ చేశాడు. నిఖిల్‌కు ఓ అమ్మాయి రాసిన లెటర్ గురించి హొస్ట్ ఆరా తీశారు.
చదవండి: డైరెక్టర్ చెప్పాడు.. నిజంగానే కాలు విరగొట్టుకున్నా: హీరోయిన్
దీనికి నిఖిల్ స్పందిస్తూ.. ‘అవును అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న. అదే సమయంలో ఓ అమ్మాయి నాకు లెటర్ రాసింది. ఆ ఉత్తరం చదివి భావోద్వేగానికి గురయ్యా. ఆ లేఖ చదవడం పూర్తయ్యేసరికి కళ్లనుంచి నీళ్లోచ్చాయి. తన అభిమానానికి చూసి ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే నేనొక నార్మల్ హీరోని. చిన్నప్పటి నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను అభిమానిస్తూ పెరిగిన నేను ఈ స్థాయికి వచ్చాను. అటువంటి నాకు ఒక ఫ్యాన్ అభిమానిస్తూ లేఖ రాయడం ఆశ్చర్యంగా అనిపించింది. అది చదివేసరిగా నాకు కన్నీళ్లు ఆగలేదు’ అంటూ నిఖిల్ వివరణ ఇచ్చాడు. ఇక చివరగా కార్తికేయ 2లో తనకు నచ్చిన సీన్ క్లైమాక్స్ అని చెప్పాడు. శ్రీ కృష్ణుడు గురించి చెప్పే ఈ సీన్‌లో నాకు తెలియకుండానే లీనమైపోయా.. ఆ ప్రభావం తనపై పడటంతో తెలియకుండానే ఏడ్చేశానన్నాడు. సహాజంగా వచ్చిన ఈ సీన్ క్లైమాక్స్‌కు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment