వెంకన్న దయవల్లే నా సినిమాలు హిట్ | Hero nikhil offers prayers at Tirumala temple | Sakshi
Sakshi News home page

వెంకన్న దయవల్లే నా సినిమాలు హిట్

Published Sat, Sep 26 2015 4:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

వెంకన్న దయవల్లే నా సినిమాలు హిట్

వెంకన్న దయవల్లే నా సినిమాలు హిట్

తిరుమల : 'హ్యాపీడేస్‌'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. స్వామిరారాతో బాగా ఫేమస్ అయిన యువహీరో నిఖిల్ తనకు వేంకటేశ్వరస్వామి అంటే సెంటిమెంట్ అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తిరునాథుడంటే చాలా భక్తి ఉందని.. తాను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా తిరుమల శ్రీవారిని మొక్కుకుంటానని చెప్పుకొచ్చాడు.  తిరుమలకు కుటుంబ సభ్యులతో వచ్చిన అతడు శ్రీవారిని దర్శించుకున్నాడు.  అనంతరం 'సాక్షి'తో మాట్లాడుతూ 'ఆ దేవుడి దయ వల్లే నా సినిమాలు స్వామిరారా, కార్తీకేయ విజయం సాధించాయి.

ప్రస్తుతం శంకరాభరణం సినిమా షూటింగ్‌లో ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధించేందుకు స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చాను. గత ఏడాది దీపావళికి కార్తీకేయ విడుదలై విజయం సాధించింది. ఈ దీపావళికి శంకరాభరణం విడుదల కానుండటంతో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. స్వామివారు నాకు సక్సెస్ ఇవ్వడంతో తలనీలాలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నాను. నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన కార్తీకేయ సినిమాకు సీక్వెల్ చేస్తాను. ఆ అభిమానుల ఆదరణకు అభినందనలు' అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement