అది వాళ్లే చెప్పాలి | special chit chat with hero nikhil | Sakshi
Sakshi News home page

అది వాళ్లే చెప్పాలి

Published Thu, May 18 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

అది వాళ్లే చెప్పాలి

అది వాళ్లే చెప్పాలి

 ‘హ్యాపీడేస్‌’ విడుదలై పదేళ్లవుతున్నా, నాకేమో ఇప్పుడే చిత్రపరిశ్రమలోకి వచ్చినట్లుంది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను లక్కీ అనిపిస్తోంది’’ అని హీరో నిఖిల్‌ అన్నారు. నిఖిల్, రీతూవర్మ జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన ‘కేశవ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్‌ పలు విశేషాలు చెప్పారు.  

∙‘కేశవ’లో వైవిధ్యమైన పాత్ర ట్రై చేశా. నాలోని నటనను బయటపెట్టే అవకాశం ఈ కథలో ఉంది. 650 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఆస్ట్రేలియా లాంటి చోట్ల నా సినిమా విడుదలవడం ఇదే మొదటిసారి. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ∙‘బాహుబలి 2’ వంటి పెద్ద చిత్రం బాగా ఆడుతున్న సమయంలో నా సినిమా రిలీజ్‌ అవుతుండటం కాస్త టెన్షన్‌గా ఉంది. ‘బాహుబలి 2’ హవాలోనూ మా సినిమా మంచి హైప్‌ తెచ్చుకుంది. అది మంచి ఓపెనింగ్స్‌ రావడానికి ఉపయోగపడుతుంది. ∙డైరెక్టర్స్‌కి నేను సలహాలివ్వను. వారు చెప్పింది చేస్తానంతే. నేనీ చిత్రంలో బాగా చేశానని సుధీర్‌వర్మ అంటున్నారు.

నా వరకు వంద శాతం కష్టపడ్డా. ఎలా చేశాననేది ప్రేక్షకులు చెప్పాలి. ∙టాలీవుడ్‌లో కూడా మార్పొచ్చింది. వైవిధ్యమైన కథా చిత్రాలొస్తున్నాయి. నా తర్వాతి చిత్రాలు కూడా వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి. రాజు సుందరం డైరెక్షన్‌లో కాలేజీ నేపథ్యంలో ఓ చిత్రం  చేస్తున్నా. అలాగే చందు మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ 2’ చేస్తా. ఆ తర్వాత మాస్‌ స్టైల్‌లో యాక్షన్‌ సినిమా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement