‘కేశవ’ చూడాలని ఉంది! | Director Gunasekhar Superb Speech at Keshava Audio Launch | Sakshi
Sakshi News home page

‘కేశవ’ చూడాలని ఉంది!

Published Mon, May 15 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

‘కేశవ’ చూడాలని ఉంది!

‘కేశవ’ చూడాలని ఉంది!

– దర్శకుడు గుణశేఖర్‌  
‘‘సన్ని సంగీతం బాగుంటుంది. తను ఎంత మంచి సంగీత దర్శకుడో ఎం.ఎం. కీరవాణిగారు చెప్పారు. ట్రైలర్‌ చూస్తుంటే ‘కేశవ’ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని కుతూహలంగా ఉంది. అభిషేక్‌ నామా మంచి పంపిణీదారుడే కాదు. గొప్ప ప్రేక్షకుడు కూడా. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా నిలిచిపోతాడు’’ అని దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు. నిఖిల్, రీతూవర్మ, ఇషా కొప్పీకర్‌ ముఖ్య పాత్రల్లో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో దేవాన్‌ష నామా సమర్పణలో అభిషేక్‌  నామా నిర్మించిన చిత్రం ‘కేశవ’. సన్ని ఎం.ఆర్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

 హీరో నిఖిల్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమా చేస్తున్నప్పుడు మనకు సపోర్ట్‌ చాలా అవసరం. ఆ సపోర్ట్‌ నాకు ప్రేక్షకులతో పాటు చందు, సుధీర్, చైతు అందించారు. అభిషేక్‌గారు నాకు పెద్దన్నలాంటివారు. ఆయన వంద సినిమాలు నిర్మించి, ఎంతో ఎత్తుకు చేరుకోవాలి’’ అన్నారు. ‘‘సుధీర్‌వర్మ నా ఫేవరెట్‌ దర్శకుల్లో ఒకరు. ఇలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు హీరో శర్వానంద్‌.

 ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 19న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘స్టోరీ వినగానే నిఖిల్, అభిషేక్‌గారు ‘కేశవ’ చేయడానికి అంగీకరించారు. మన కాంబినేషన్‌లో మరో చిత్రం ఎప్పుడు చేద్దాం? అని అభిషేక్‌గారు అంటున్నారు’’ అని సుధీర్‌ వర్మ చెప్పారు. నిర్మాత సి.కళ్యాణ్, దర్శకులు నందినీ రెడ్డి, చందూ మొండేటి, నటులు అడివి శేషు, ‘వెన్నెల’ కిశోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement