తమిళ సినిమా రీమేక్లో నిఖిల్..? | nikhil in tamil super Hit kanithan | Sakshi
Sakshi News home page

తమిళ సినిమా రీమేక్లో నిఖిల్..?

Published Wed, May 17 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

తమిళ సినిమా రీమేక్లో నిఖిల్..?

తమిళ సినిమా రీమేక్లో నిఖిల్..?

వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తుంది. ఈ శుక్రవారం రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన కేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ యంగ్ హీరో త్వరలో కన్నడలో సూపర్ హిట్ అయిన కిర్రాక్ పార్టీ రీమేక్లో నటించనున్నాడు. ఆ తరువాత కూడా రీమేక్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్.

తమిళ్లో అధర్వ హీరోగా తెరకెక్కిన గణితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బిబిసిలో రిపోర్టర్గా వర్క్ చేయాలనుకున్న ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవటం, తరువాత ఆ కేసునుంచి ఆ యువకుడు ఎలా బయట పడ్డాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కోలీవుడ్లో ఈ సినిమాను డైరెక్టర్ చేసిన టి ఎన్ సంతోష్ తెలుగులోనూ డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement